వాతావరణంలో పెను మార్పులు: భవిష్యత్తులో తీవ్ర వడగాలులు: శాస్త్రవేత్తల వార్నింగ్
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై పలు దేశాల శాస్త్రవేత్తలు ఇచ్చిన నివేదికలు అదే సమయంలో పాలసీలకు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ)ఆమోదం తెలిపింది. క్లైమేట్ ఛేంజ్ 2021: ది ఫిజికల్ సైన్స్ బేసిస్ పేరుతో వర్కింగ్ గ్రూప్-1 తీసుకొచ్చిన పాలసీల నివేదికకు 54వ ఐపీసీసీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నివేదికను 234 మంది రచయితలు, 195 దేశాల ప్రభుత్వాలు ఫైనలైజ్ చేసి ఆమోదం తెలిపాయి.
Recommended Video
గతంలో వాతావరణం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉంటుందో అన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక తయారు చేసింది వర్కింగ్ గ్రూప్ 1. ఇందులో ప్రాథమికంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడానికి గల కారణాలు, ఇందులో మనిషి పాత్ర ఎంత అనే అంశాలపై స్టడీ చేసింది. ఇప్పటికే వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మనిషి విడుదల చేసే ఉద్గారాలు దీనిపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఇది ఇలానే వదిలేస్తే ఎలాంటి నష్టాలకు దారి తీయొచ్చనే అంశాలను కూడా పరిశీలించింది.

వర్కింగ్ గ్రూప్ విడుదల చేసిన నివేదికలో ప్రధాన అంశాలు:
* భూగ్రహం పై వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయంటే అది కచ్చితంగా మానవ తప్పిదమే అనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చేశారు.
* మానవుడు విడుదల చేసిన ఉద్గారాలతోనే వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి కచ్చితంగా మనిషే బాధ్యత వహించాలి. ఇదే విషయాన్ని సైంటిఫిక్‌గా స్టడీ చేసి ఆధారాలతో కనుగొన్నారు.
* 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో భూమి వాతావరణ వ్యవస్థలో మార్పులు కనిపిస్తాయి. 2030 నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 1.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశాలున్నాయి.
* గ్రీన్ హౌస్ గ్యాస్‌ల పై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కార్బన్ డైయాక్సైడ్ మాత్రమే కాదు... మీథేన్ లాంటి ప్రమాదకరమైన వాయువులపై కూడా దృష్టి సారిస్తున్నారు.
* ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో భూవాతావరణంకు మరింత నష్టం చేకూరుతుంది. భూమి..మహా సముద్రాల పర్యావరణ వ్యవస్థలు కూడా ఈ సమస్యను పరిష్కరించడంలో పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
* భూమిపై ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి.కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగించడం అనేది అత్యంత కష్టమైన సవాలు. అయితే ఇతర వాయువుల విడుదలను నియంత్రిస్తే దీన్ని క్రమంగా అదుపులోకి తీసుకురావొచ్చు.
* కార్బన్ ఉద్గారాలను నియంత్రించేందుకు కేటాయించిన బడ్జెట్ అంచనాలు. గత నివేదికల ఆధారంగా కార్బన్ డైయాక్సైడ్‌ను ఏ మేరకు నియంత్రించొచ్చు అనే అంశంపై పరిశీలించడం జరిగింది. అయితే బడ్జెట్‌లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు.
వాతావరణంపై మానవుని ప్రభావం
మనిషి మూలంగానే వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మనిషి ప్రభావం వాతావరణంపై చాలా ఉందని చెప్పారు. గత 2వేల సంవత్సరాలుగా వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయంటే దీనిపై మనిషి ప్రభావం చాలా ఉంది
2019లో వాతావరణంలో CO2 కాన్సన్ట్రేషన్ గత 2మిలియన్ సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఉన్నట్లు తాము పరిశీలించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ కూడా ఇంచు మించు అదే స్థాయిలో ఉన్నాయని వెల్లడించారు.గత 800,000 ఏళ్లతో పోలిస్తే 2019లోనే ఈ రెండు వాయువులు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని చెప్పారు.
*వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇది 1970 నుంచి పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయంటే అందుకు కారణం మానవుడే అని స్పష్టంగా తెలుస్తోంది.
భూమిపై వాతావరణంలో మనిషి ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు..?












Click it and Unblock the Notifications