వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ ఆలోచనలే భయంకరం, జైలుకే: హిల్లరీ వర్సెస్ ట్రంప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధ్యక్ష పదవి నామినేషన్‌కు ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తిని ఆమె అన్నారు. దేశాధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడన్నారు.

ఆయన ఎన్నిక చరిత్రాత్మక తప్పిదం అవుతుందన్నారు. శాన్ డియాగోలో గురువారం మాట్లాడిన ఆమె ట్రంప్ విదేశీ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రిపబ్లికన్ అభ్యర్థి అసంబద్ధమైన వ్యక్తి అన్నారు. తమ పార్టీ ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ఆమె సమర్థించుకున్నారు.

ట్రంప్ తన విదేశీ విధానంతో యుద్ధాలను చేస్తారని, దాని వల్ల దేశ ఆర్థిక స్థితి బలహీనపడుతుందన్నారు. విదేశీ విధానాలకు సంబంధించి ఆయన ఆలోచనలు చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. తనతో పాటు దేశంలో, ప్రపంచంలో చాలా మంది ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించలేడన్నారు.

Hillary Clinton Warns That Donald Trump

ట్రంప్‌ ఆలోచనలు కేవలం వైవిధ్యమైనవి కావని, చాలా భయంకరమైనవన్నారు. ఆయనవన్నీ అబద్ధాలు, వ్యక్తిగత కలహాలు సృష్టించేలా మాట్లాడుతున్నారన్నారు. అధ్యక్ష పదవి అంటే చాలా అవగాహన, స్థిరత్వం, ఎంతో బాధ్యతతో కూడుకున్నదన్నారు. అమెరికా భవిష్యత్తును ట్రంప్‌ చేతిలో ఊహించుకోలేమన్నారు. మన పిల్లల భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టలేమన్నారు.

హిల్లరీ పైన క్లింటన్ కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు. తనపై హిల్లరీ చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. అమెది అవాస్తవ ప్రచారం, అవన్నీ తప్పుల తడకల ప్రసంగాలన్నారు. హిల్లరీ క్లింటన్‌ జైలుకు వెళ్లక తప్పదన్నారు. కాగా, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారయింది. డెమోక్రటిక్ నుంచి హిల్లరీ ముందంజలో ఉన్నారు.

English summary
Donald Trump calls for Hillary Clinton to be jailed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X