కారణం లేకుండా.. పాకిస్తాన్‌లో హిందూ మహిళ నరికివేత
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఓ హిందూ మహిళ దారుణ హత్యకు గురయింది. నసీరాబాద్ జిల్లాకు చెందిన జనియా కుమారి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఓ హిందూ మహిళ దారుణ హత్యకు గురయింది. నసీరాబాద్ జిల్లాకు చెందిన జనియా కుమారి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
జనియాను కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. అనంతరం పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై స్పష్టత లేదు.

తమ ప్రాంతంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే జనియాను కారణం లేకుండా హత్య చేశారని ఆమె సోదరుడు జలోరాం తెలిపారు. నిందితుల నుంచి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జనియా కుమారి పైన బుధవారం నాడు బాబా కోట్ ప్రాంతంలో దాడి జరిగిందని చెప్పారు. తమ సోదరిని చంపిన వారి పైన సరైన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications