HIV : 300కు పైగా చిన్నారులకు హెచ్ఐవి - డాక్టర్ నిర్లక్ష్యమే కారణం..!!

పాకిస్తాన్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో బయటపడిన వైద్య నిర్లక్ష్యం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. రహస్యంగా జరిపిన దర్యాప్తులో అసురక్షిత ఇంజెక్షన్ పద్ధతులు, ప్రాథమిక పరిశుభ్రత నియమాల ఉల్లంఘనలు కారణంగా చిన్నారులకు ప్రాణాంతక HIV/AIDS వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించినట్టు బయటపడటం సర్వత్రా కలకలం రేపుతోంది.

కలవరపరిచిన గణాంకాలు..

ప్రావిన్షియల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లు, ప్రైవేట్ క్లినిక్‌లు, లీకైన పోలీసు రికార్డుల ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం, నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో టౌన్సా ప్రాంతంలో కనీసం 331 మంది పిల్లలు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించబడ్డారు. ఇది ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం తీవ్ర ఆరోగ్య సంక్షోభానికి సంకేతంగా మారింది.

hiv-injection-out-break-exposes-safety-for-300-children-in-pakisthan-and-news-create-shock-among-the

దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

కాగా దర్యాప్తులో భాగంగా సేకరించిన 32 గంటల వీడియో ఫుటేజీలో ఆసుపత్రిలో కనీస వైద్య ప్రమాణాలు కూడా పాటించకపోవడం స్పష్టమైంది. వాడిన సిరంజిలను మళ్లీ ఉపయోగించడం, గ్లౌజులు లేకుండా ఇంజెక్షన్లు ఇవ్వడం, వైద్య వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయడం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకున్నాయి.

ఇన్ఫెక్షన్ వ్యాప్తి అసలు కారణం..

డేటా విశ్లేషణ ప్రకారం, ఈ కేసుల్లో చాలావరకు తల్లి నుంచి బిడ్డకు వ్యాప్తి కాలేదని తేలింది. పరీక్షించిన 97 కుటుంబాల్లో కేవలం నలుగురు తల్లులు మాత్రమే హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉండటం, అసురక్షిత వైద్య పద్ధతులే ప్రధాన కారణమనే అనుమానాలను బలపరుస్తోంది. ముఖ్యంగా కలుషిత సూదులు, సిరంజిల వాడకం ఈ వ్యాధి వ్యాప్తికి కీలకంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు.

బాధాకర ఘటనలు..

ఈ సంక్షోభానికి ప్రతీకగా నిలిచిన ఘటనల్లో ఎనిమిదేళ్ల మహమ్మద్ అమీన్ మరణం ఒకటి. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన కొద్ది రోజులకే అతను మరణించగా, అతని సోదరి కూడా అదే వ్యాధికి గురయ్యింది. సాధారణ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఈ పిల్లలకు అక్కడి నిర్లక్ష్యమే ప్రాణాంతకమైందని వారి కుటుంబం ఆరోపిస్తోంది.

మొదట గుర్తించిన వైద్యుడు..

స్థానిక వైద్యుడు డాక్టర్ గుల్ ఖైస్రానీ తన క్లినిక్‌కు వచ్చే పిల్లల్లో హెచ్‌ఐవీ కేసులు అసాధారణంగా పెరగడం గమనించి మొదట అప్రమత్తమయ్యారు. ఆయన పరిశీలనలో ఎక్కువ మంది పిల్లలు అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు బయటపడింది. దీంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది.

అధికారుల స్పందన..

ఆసుపత్రి కొత్త మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఖాసిం బుజ్దర్ ఈ వీడియోల ప్రామాణికతపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, నిపుణులు మాత్రం ఇవి తీవ్రమైన వైద్య నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. బాధిత కుటుంబాలు పూర్తి స్థాయి దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటన పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన మానిటరింగ్ లేకపోవడం, సిబ్బంది శిక్షణ లోపం, వైద్య పరికరాల కొరత వంటి సమస్యలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కూడా దెబ్బతింటోంది.

నిపుణుల హెచ్చరికలు..

ఆరోగ్య నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఒకసారి వాడిన సూదులను మళ్లీ ఉపయోగించడం అత్యంత ప్రమాదకరం. ఇది హెచ్‌ఐవీతో పాటు హెపటైటిస్ బి, సి వంటి వ్యాధుల వ్యాప్తికి దారితీస్తుంది. అందుకే ప్రతి ఇంజెక్షన్‌కు కొత్త సిరంజి వాడటం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రుల్లో కఠిన నిబంధనలు అమలు చేయడం, సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం, పరికరాల వినియోగంపై కఠిన పర్యవేక్షణ అవసరం. అలాగే బాధిత కుటుంబాలకు వైద్య సహాయం, ఆర్థిక మద్దతు అందించాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+