తేనె పూసిన కత్తి: ట్రంప్ ఇంట్లో మన తేనె, భారత్‌కి మాత్రం దెబ్బే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి భారతీయ తేనె అంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50 శాతం సుంకం విధించడంతో భారత తేనె పరిశ్రమ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎగుమతి చేసే తేనెలో అధిక భాగం అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియాకు వెళ్తుంది.

ట్రంప్ కూతురు ఇవాంకాకు భారతీయ తేనె అంటే చాలా ఇష్టం
అమెరికన్ పాడ్‌కాస్ట్ 'ది స్కిన్నీ కాన్‌ఫిడెన్షియల్'లో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. తన ఉదయం అల్పాహారంలో భాగంగా గ్రీక్ యోగర్ట్, ఆర్గానిక్ తేనె, బాదం పప్పుతో తయారు చేసిన స్మూతీని ఇష్టపడతానని తెలిపారు. ఆమెలాగే ఫాస్ట్ ఫుడ్‌ను ఇష్టపడే అధ్యక్షుడు ట్రంప్ కూడా తమ ఆహారంలో తేనెను చేర్చుకుంటారని తెలిసింది. దీన్నిబట్టి భారతీయ తేనె వైట్ హౌస్ నుంచి సాధారణ అమెరికన్ ఇళ్ల వరకు వినియోగంలో ఉందని స్పష్టమవుతుంది.

Honey-Coated Blade Indian Honey Loved by Trump Family Yet Hit by US Tariffs

ట్రంప్ భార్య మెలానియాకు కూడా తేనె అంటే ఇష్టం
'ది టేక్‌అవుట్' అనే వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. ట్రంప్ భార్య మెలానియా కూడా విటమిన్లు అధికంగా ఉండే స్మూతీలను ఇష్టపడతారు. ఆమె 2013లో ఫేస్‌బుక్‌లో పంచుకున్న ఒక రెసిపీలో పాలకూర, సెలెరీ, తేనె, ఆలివ్ ఆయిల్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఆమె తన ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉన్నందున, ఆమె ఆహారపు అలవాట్లలో మార్పులు ఉండకపోవచ్చు.

భారతీయ తేనె పరిశ్రమపై తీవ్ర ప్రభావం
అమెరికా విధించిన 50 శాతం సుంకం కారణంగా ఉత్తర ప్రదేశ్ లోని సహారన్‌పూర్‌కు చెందిన తేనె ఎగుమతిదారులు ఆర్డర్లు తగ్గడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత తేనె ఎగుమతిదారులు, తేనెటీగల పెంపకందారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్ సుమారు 1.52 లక్షల టన్నుల తేనెను ఉత్పత్తి చేసింది. అందులో దాదాపు 79,720 టన్నులు కేవలం అమెరికాకు మాత్రమే ఎగుమతి అయ్యాయి. ఇది దేశ మొత్తం తేనె ఎగుమతుల్లో సుమారు 80 శాతంగా ఉంది.

ఈ సుంకం వల్ల తేనె ఎగుమతి తగ్గితే, అమెరికా మార్కెట్‌లో లాభం అర్జెంటీనా, వియత్నాం, ఉక్రెయిన్, మెక్సికో వంటి దేశాలకు వెళుతుంది. మరోవైపు, భారత్‌లో తేనె ధరలు పడిపోతాయి, దీంతో రైతులు, తేనె పరిశ్రమ తీవ్రంగా నష్టపోతాయి. దీనిని ఎదుర్కొనేందుకు, ప్రభుత్వం సహజ తేనెపై కనీస ఎగుమతి ధరను (MEP) టన్నుకు 2,000 డాలర్ల నుండి 1,400 డాలర్లకు తగ్గించింది.

భారత తేనె పరిశ్రమ విలువ సుమారు రూ. 3500 కోట్లు. అమెరికా సుంకాల వల్ల ఈ పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం 'జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్'ను కూడా ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు ఇండియాలో తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+