Hormuz: ట్రంప్ బెదిరింపుల వేళ ఇరాన్ పాత వ్యూహం..! మళ్లీ తెరపైకి హార్ముజ్..!

గతంలో ఇజ్రాయెల్ తమపై దాడి చేసినప్పుడు మధ్యప్రాచ్యంలోని అమెరికా స్దావరాల్ని టార్గెట్ చేసి తమ మిత్రదేశాలతో వైరం తెచ్చుకున్న ఇరాన్ ఈసారి ఆ తప్పు చేయడం లేదు.

ఇరాన్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్న అమెరికా-ఇజ్రాయెల్ ఓ పాయింట్ దగ్గర మాత్రం ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఉంటున్నాయి. అదే హార్ముజ్ (Harmuz). ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు సాగే మార్గంలో మధ్యన ఉన్న ఓ ఇరుకైన జలసంధి ఇది. అమెరికా, ఇజ్రాయెల్ దూకుడు చర్యలకు దిగితే హార్ముజ్ ను మూసేస్తామని ఇరాన్ మరోసారి హెచ్చరికలు మొదలుపెట్టింది. దీంతో ప్రపంచదేశాల ఒత్తిడి అమెరికాపై పడుతోంది.

ఇరాన్ ను సమీపిస్తున్న అమెరికా నౌకలు

ప్రస్తుతం అమెరికాకు చెందిన రెండు యుద్ధ విమాన వాహక నౌకల బృందాలు ఇరాన్‌కు చేరువలో మోహరించాయి. వీటిలో యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ తీరప్రాంతానికి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. గల్ఫ్ ప్రాంతంలో తమ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి మరో బృందాన్ని పంపారు. దీనిపై ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా శక్తి ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాశనం చేయడంలో విజయవంతం కాదని ఆయన ప్రకటించారు. ఒక అమెరికా యుద్ధనౌక కూడా మునిగిపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ బల ప్రదర్శన, బెదిరింపుల నడుమ, జెనీవాలో ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించేందుకు ఇరువర్గాలు చర్చిస్తున్నాయి.

Hormuz Showdown Iran s Most Critical Card in the Escalating Standoff with the US

అమెరికా స్ధావరాల్ని టార్గెట్ చేయని ఇరాన్

అయితే ఇది నిజంగా యుద్ధానికి ముందడుగా, లేదా దశాబ్దాలుగా అమెరికా-ఇరాన్ సంబంధాలను నిర్వచించిన సుదీర్ఘ, చక్రీయ ఘర్షణలో ఇది మరో భాగమా అనేదే ఇక్కడ ప్రశ్న. గతేడాది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి దిగిన తర్వాత ఇరుదేశాల మధ్య సాగిన యుద్ధంలో అమెరికా దూరినా ఎదురుదెబ్బలు తప్పలేదు. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాల్ని ఇరాన్ టార్గెట్ చేయడం మొదలుపెట్టగానే ట్రంప్ యుద్ద విరమణ ప్రకటించక తప్పలేదు. ఇప్పుడు మరోసారి ఇరాన్ ను కెలుకుతున్న అమెరికాను ఆ దేశం హార్ముజ్ జలసంధిని చూపి బెదిరిస్తోంది.

Hormuz Showdown Iran s Most Critical Card in the Escalating Standoff with the US

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ విన్యాసాలు (hormuz)

గతంలో ఇజ్రాయెల్ తో వార్ సందర్భంగా మధ్యప్రాచ్యంలోని తమ మిత్రదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాన్ని టార్గెట్ చేసిన ఇరాన్.. ఆయా దేశాలతో తమ సంబందాలను బలహీనపర్చుకుంది. దీంతో మరోసారి అలాంటి పరిస్ధితి రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది. మరోవైపు అమెరికా స్థావరాలు కలిగిన ఇరాన్ మిత్రదేశాలు సౌదీ, ఖతార్, కువైట్, ఓమాన్ వంటి ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి చురుకుగా పనిచేస్తున్నాయి. అలాగే ఇరాన్ -అమెరికా యుద్దం జరిగినా అన్ని ఆయుధాల కంటే పెద్ద ఆయుధంగా హార్ముజ్ జలసంధి కనిపిస్తోంది. ఇది నిస్సందేహంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ కదిలిస్తుంది. తాజాగా ఇరాన్ తమ బెదిరింపుల్లో భాగంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తో హార్ముజ్‌ జల సంధిలో సైనిక విన్యాసాలు కూడా చేయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+