15 మీటర్ల పొడవు, 35 టన్నుల బరువు... ఇంతకీ ఇదేం జలచరమబ్బా?
అరుదైన జలచరం మృతదేహం ఒకటి ఇండోనేషియాలోని హలంగ్ బీచ్‌కు కొట్టుకొచ్చింది. 15 మీటర్ల పొడవు, 35 టన్నుల బరువుతో భారీ సైజులో ఉన్న ఈ జలచరం మృతదేహం ఉన్న ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న ద్రవం పేరుకుపోయింది.
జకర్తా: సముద్ర తీర ప్రాంతాలకు భారీ పరిమాణంలో ఉన్న తిమింగలాలు, ఇతర జీవులు కొట్టుకరావడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా అరుదైన జలచరం మృతదేహం ఒకటి ఇండోనేషియాలోని హలంగ్ బీచ్‌కు కొట్టుకొచ్చింది.
15 మీటర్ల పొడవు, 35 టన్నుల బరువుతో భారీ సైజులో ఉన్న జలచరం మృతదేహాన్ని అస్రుల్ టునకోటా అనే స్థానికుడు గుర్తించాడు. జలచరం ఉన్న ప్రాంతంలో ఎరుపు రంగులో ఉన్న ద్రవం పేరుకుపోయింది.

ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని దానిని పరిశీలించారు. పెద్ద పరిమాణంలో విశాలమైన దేహం కలిగిన జీవిని బలీన్ తిమింగలం అయి ఉండొచ్చని లీ కాంగ్ చియాన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అధికారి మార్కస్ చువా తెలిపారు.












Click it and Unblock the Notifications