యూకే హైకోర్టులో మాల్యాకు భారీ ఊరట...న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?
లండన్: యూకే హైకోర్టులో లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు భారీ ఊరట లభించింది. భారత్‌కు మాల్యాను అప్పగించాలంటూ విచారణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. భారత్‌కు అప్పగించడంపై తను అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్నాడు మాల్యా. లండన్‌లోని హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనం మాల్యా కేసును విచారణ చేసింది. జస్టిస్ జార్జ్ లెగ్గట్, జస్టిస్ ఆండ్రూ పాప్లెవెల్ వాదనలు విన్నారు.
మాల్యా మోసాలకు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని యూకే హోం సెక్రటరీ చేసిన ఆరోపణలను జడ్జీలు కొట్టివేస్తూ మాల్యా అప్పీల్ చేసుకునేందుకు పరిమిత సమయంను ఇస్తూ లాయర్లకు సూచనలు చేశారు. ఇప్పుడు అప్పీల్ చేసుకునేందుకు అనుమతి వచ్చినందున తన కేసును యూకే హైకోర్టు పూర్తి స్థాయిలో విననుంది. ఒకవేళ హైకోర్టు కనుక భారత్‌కు అప్పగించే విషయమై అనుమతి నిరాకరించి ఉంటే సుప్రీంకోర్టులో కూడా అప్పీలు తిరస్కరణకు గురయ్యేది. అంతేకాదు 28 రోజుల్లో భారత్‌కు అప్పగించే ప్రక్రియ ముగిసేది.

యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాల్యా స్పందించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. తనపై నమోదు చేసిన కేసుల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ముందుగా ప్రాథమిక ఆరోపణలపై తను నెగ్గాల్సి ఉందని చెప్పారు. బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తానని ఇప్పటికీ చెబుతున్నానని చెప్పిన మాల్యా ఆ డబ్బులు భారత్ నుంచే ఇవ్వాల్సి ఉందని ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. కోర్టుకు హాజరుకాబోయే ముందు తను చాలా పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. అనుకున్నట్లుగానే విజయ్ మాల్యాకు భారత్‌కు అప్పగించే విషయమై భారీ ఊరట లభించిందనే చెప్పాలి.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications