‘ప్లేబాయ్‌’ వ్యవస్థాపకుడు.. హ్యూ హెఫ్నర్ కన్నుమూత

నగ్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మ్యాగజైన్ ‘ప్లే బాయ్‌’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్(91) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు.

న్యూయార్క్: నగ్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మ్యాగజైన్ 'ప్లే బాయ్‌' వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్(91) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఈ విషయాన్ని ప్లే బాయ్‌ సంస్థ ట్విట్టర్‌లో తెలియజేసింది.

1926లో చికాగోలో జన్మించిన హ్యూ కాపీ రైటర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. 1953లో ఆయన కేవలం 1600 డాలర్లతో 'ప్లే బాయ్‌'ను ప్రారంభించారు. తొలినాళ్లలో క్యాలెండర్‌గా దర్శనమిచ్చిన ప్లే బాయ్‌ తర్వాతి కాలంలో మ్యాగజైన్ గా మారిపోయింది.

Hugh Hefner, Playboy Magazine Founder and Star of Girls Next Door, Dies at 91

ప్లే బాయ్ మ్యాగజైన్.. కవర్‌​ పేజీ సహా మొత్తం నగ్న ఫొటోలతో కథనాలను ప్రచురించేంది. సెక్స్ కు సంబంధించిన ఆరోగ్యకర అంశాలను చర్చించాలనే లక్ష్యంతోనే తాను ప్లేబాయ్ కి రూపమిచ్చినట్లు హ్యూ హెఫ్నర్ తరచూ చెబుతుండేవారు.

అలా మొదలైన ప్లే బాయ్‌ ప్రస్థానం సుమారు ఆరు దశాబ్దాలపాటు నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. ఇంటర్వ్యూలు, కల్పిత గాథలు, ఫిమేల్‌ సెలబ్రిటీల న్యూడ్‌ ఫోటో షూట్‌లు.. ఇలా ఆ మ్యాగజైన్ లో పలు విషయాలను ప్రచురించేవారు.

అయితే మధ్యలో చాలా వివాదాలు చుట్టుముట్టాయి. న్యూడ్ ఫొటోలతో పూర్తిగా మ్యాగజైన్ ను నింపేస్తున్నారని, ఈ మ్యాగజైన్ పై నిషేధం విధించాలని పలువురు ఆందోళన చేశారు. అదే సమయంలో యూఎస్‌ తపాలా శాఖ ప్లే బాయ్ మ్యాగజైన్ ను బట్వాడా చేయకుండా నిలిపివేసింది.

ఈ విషయంలో హ్యూ హెఫ్నర్ న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. అలా వివాదాల తర్వాత కాస్త సర్క్యులేషన్‌ తగ్గినప్పటికీ... ప్లే బాయ్‌ మ్యాగజైన్ కు అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు.

ఏడాదిన్నర క్రితం ప్లే బాయ్ యాజమాన్యం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ మ్యాగజైన్ లో నగ్న చిత్రాలను ప్రచురించబోమని సంచలన ప్రకటన చేసింది. కానీ, ఏడాది గడవకముందే మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్లే బాయ్ యాజమాన్యం ప్రకటించింది.

మార్చి నెల నుంచి మళ్లీ పాత తరహాలో నగ్న చిత్రాలతో ప్లేబాయ్ ని తీసుకొచ్చేసింది. వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది కూడా. వయసు పై బడటంతో హ్యూ హెఫ్నర్ గతంలోనే ప్లేబాయ్ చీఫ్ బాధ్యతలను తన కొడుకు జూనియర్‌ హెఫ్నర్ కు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+