హిజబ్‌కి వ్యతిరేకంగా పోరాడిన యువతికి హ్యుమన్ రైట్స్ అవార్డు...
ఇరాన్‌లో హిజాబ్‌కి వ్యతిరేకంగా పోరాడిన 22 ఏళ్ల యువతికి ఆమె మరణానంతరం హ్యుమన్ రైట్స్ అవార్డు లభించింది. ఈ ఏడాది ఐరోపా సమాఖ్య హ్యూమన్ రైట్స్ ప్రైజ్ మహాసా అమినిని వరించింది. ఇరాన్‌లో గత కొన్నేళ్లుగా హిజాబ్ విషయంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో మొదలైన ఈ ఉద్యమంలో హిజబ్ సరిగా ధరించలేదని మెరాలిటి పోలీసులు మహసా అమినిని అరెస్టు చేశారు. అయితే ఆమె కస్టడీలో తీవ్ర గాయలపాలయ్యారు. అయితే చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్ 16న ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో ఇరాన్ మహిళంతా భగ్గుమన్నారు. విమెన్ లైఫ్ ప్రీడమ్ పేరుతో వేలాది మంది మహిళలు రోడ్డెక్కి ఉద్యమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వందలాదిమంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు.
మహసా అమినికి అవార్డు : అయితే, ఈ క్రమంలోనే మహసా అమినికి ఐరోపా సమాఖ్య హ్యూమన్ రైట్స్ ప్రైజ్ ప్రకటించింది. సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా ఉద్యమించిన ఆండ్రీ సకరోవ్‌కి గుర్తుగా ఐరోపా సమాఖ్య ఈ అవార్డుని ప్రతి ఏటా బహుకరించడం మొదలు పెట్టింది. 1988 నుంచి ఈ అవార్డులను అందజేస్తుంది. మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల కోసం పోరాడిన వాళ్లకి ఈ అవార్డుతో ఇలా సత్కరిస్తారు. ఈ సారి ఈ అవార్డు మహసా అమినిని వరించింది.

కోమాలో ఉన్న అర్మిత : అయితే, ఇరాన్‌లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. హిజబ్‌కి వ్యతిరేకంగా ఇంకా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఈ వివాదంపై ప్రాణాలు కోల్పోయినా సరే ఈ వివాదం ఇంకా సమసిపోలేదు. తాజాగా ఇరాన్‌లో ఓ పదహరేళ్ల యువతిపై దాడి జరిగింది. హిజాబ్‌ని వ్యతిరేకిస్తున్నందుకు మెట్రోలోనే ఆమెపై దాడికి దిగారు. ప్రస్తుతం ఆ యువతి కోమాలో ఉంది. భారీ భద్రత నడుమ ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆ యువతి పేరు అర్మిత గరవంద్. మెట్రోలో ప్రయాణిస్తుండగా హిజాబ్ ధరించాలని పోలీసులు పట్టుబట్టినట్టు, అందుకు అర్మిత ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు.












Click it and Unblock the Notifications