పెనుముప్పు: 15అడుగుల లోతులో మునిగిపోయే ప్రమాదం, తంపా వైపుగా ఇర్మా

Subscribe to Oneindia Telugu
  Hurricane Irma:Storm Moves Towards Tampa15అడుగుల లోతులో మునిగిపోయే ప్రమాదం,తంపా వైపుగాఇర్మా|Oneindia

  ఫ్లోరిడా: వరుస తుఫాన్లు అమెరికా ప్రజలను ప్రాణ సంకటంలోకి నెడుతున్నాయి. బతుకు జీవుడా అంటూ లక్షల మంది జనం అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పూర్తిగా స్తంభించిపోయిన జనజీవనంతో ఫ్లోరిడా ఇప్పుడో నరకాన్ని తలపిస్తోంది.

  విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలంతా అంధకారంలోనే ఉండిపోయారు. మరోవైపు తుఫాను తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో నష్ట నివారణను తగ్గించేందుకు అమెరికా తలపట్టుకుంది. ప్రత్యక్ష చర్యలకు ప్రభుత్వానికి ఆస్కారం లేకపోవడంతో.. ప్రజలే అప్రమత్తంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  ఇర్మా తీవ్రత:

  ఇర్మా తీవ్రత:

  ఆదివారం ఉదయం ఫ్లోరిడాలోని కీస్‌ వద్ద ఇర్మా హరికేన్‌ తీరాన్ని తాకింది. 12గం. పాటు దీని తీవ్రత మూడో స్థాయికి తగ్గినట్లే కనిపించినా.. నాలుగో స్థాయి పెను తుఫానుగా మళ్లీ విజృంభించింది. గంటకు 8మైళ్ల వేగతంతో వాయువ్యం వైపుగా వెళ్తోంది. ఫ్లోరిడాతో పాటు మియామీ, ఫోర్ట్‌ లాడెర్‌డేల్‌, తంపా ప్రాంతాల దిశగా తుఫాను వేగంగా వెళ్తుండటంతో.. అక్కడ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

  చాలామంది భారతీయులు ఆ ప్రాంతాల్లోనే:

  చాలామంది భారతీయులు ఆ ప్రాంతాల్లోనే:

  మియామీ, ఫోర్ట్‌ లాడెర్‌డేల్‌, తంపా ప్రాంతాల్లో ఇర్మా ఎఫెక్ట్ పడటంతో.. అక్కడి భారతీయుల్లో కలవరం మొదలైంది. ఫ్లోరిడాలో ఉంటున్న 1,20,000 మంది భారతీయుల్లో ఎక్కువ మంది ఈ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. మియామీ, తంపా పట్టణాల్లో ఇర్మా తీవ్రతతో చివురాటకులా వణికిపోతున్నాయి. ముంచెత్తిన వరదలతో ఎటు చూసినా జల వలయమే కనిపిస్తోంది.

  అంధకారంలోనే:

  అంధకారంలోనే:

  వీధులన్నీ నదుల్ని తలపిస్తుండగా.. ఈదురు గాలులకు పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేల కూలుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 24 కౌంటీల్లో దాదాపు 13.5 లక్షల మంది అంధకారంలోనే ఉండిపోయారు. ఒక్క మియామీ-డేడ్ పట్టణంలోనే 6.5లక్షల మంది అంధకారంలో చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.

  15అడుగుల లోతుకు మునిగిపోయే ప్రమాదం:

  15అడుగుల లోతుకు మునిగిపోయే ప్రమాదం:

  ఆదివారం మధ్యాహ్నాం నుంచి మనాటీ కౌంటీలో అధికారులు కర్ఫ్యూ విధించారు. నైరుతి తీర ప్రాంతాలైన కేప్‌సేబుల్‌, కేప్టివా వంటిచోట్ల సముద్ర కెరటాలు 15 అడుగుల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది. అంతెత్తు కెరటాలు పట్టణాలను తాకితే.. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉంది.

  మరోవైపు తలదాచుకోవడానికి కీన్ పట్టణంలో సురక్షిత ప్రాంతమే లేదని హరికేన్ కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఫ్లోరిడాలోని నైరుతి తీరమంతా 10నుంచి 15అడుగుల లోతు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The storm is going to change course to north-northwest during the night, the USNHC has said. It’s currently just north of Arcadia at this grid reference so that change will push it towards St Petersburg/Tampa.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి