Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్.. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగింపు"

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం పై భారత్ లోని యూఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ కు ఒక్క ఫోన్ కాల్ ద్వారా యుద్ధాన్ని ఆపొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలోకి యూఏఈ ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరం తమ దేశానికి లేదని తేల్చి చెప్పారు.

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ లోని యూఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలోకి రావాలన్న ఆలోచన యూఏఈ కు లేదన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ కు యూఏఈ కావాల్సిన దేశం అని పేర్కొన్నారు. ఇరాన్ సరిహద్దు దేశం యూఏఈ అని.. అలాగే అభ్రహామ్ ఎకార్డ్స్ లో భాగాంగా ఇజ్రాయెల్ తో యూఏఈకి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిపేందుకు యూఏఈ కృషి చేస్తున్నట్లు హసన్ మీర్జా తెలిపారు.

ఈ మేరకు ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కమాండ్స్ ను గల్ఫ్ నాయకులు గౌరవిస్తారని.. నాయకులే కాకుండా అక్కడి ప్రజలు, బిజినెస్ కమ్మూనిటీస్ లో ప్రధాని మోదీకి తగిన గౌరవం ఉందని హసన్ మీర్జా స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని మోదీకి ఆ క్రెడిబిలిటీ ఉందని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్ లో పరిష్కరించవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నుంచి ఒక్క ఫోన్ కాల్ తో యుద్ధం ముగుస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో హసన్ మీర్జా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

HussainMirza Says PM Modi Call Could Stop Israel-Iran War UAE Ambassador s Key Statement on war

ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం వేళ ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడిగా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ను ఎన్నుకుంది అక్కడి ప్రభుత్వం. అయినా ఆ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏమాత్రం తగ్గడం లేదు. సెంట్రల్ ఇరాన్ పై తాజాగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు చేపట్టింది. అలాగే బీరట్ లోని హిజ్ బొల్లాకు చెందిన స్థావరాలను ధ్వంసం చేసింది. మరోవైపు యుద్ధం ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. తాజాగా మృతుల సంఖ్య 1,332 కు చేరింది. అలాగే వేల మంది గాయపడ్డారు. ఇక ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన సైనికులు 7గురు మృతి చెందినట్లు అమెరికా పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+