యోగా ఆరాధ్యుడిని- ఐరాస చీఫ్: న్యూయార్క్‌లో సెషన్: సెలెబ్రిటీలు వీరే
వాషింగ్టన్: ఇవ్వాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యోగాసనాలు వేశారు. సూర్య నమస్కారాలు చేశారు. ప్రాణాయామంతో యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి నార్త్ లాన్‌లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. యోగా సెషన్‌ను స్వయంగా ఆయన లీడ్ చేశారు.
కొద్దిసేపటి కిందటే ఆయన నార్త్ లాన్‌కు చేరుకున్నారు. అంతకుముందు- ఐక్యరాజ్య సమితి ఆవరణలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. మౌనం పాటించారు. అనంతరం అక్కడి నుంచి నార్త్ లాన్‌కు చేరుకున్నారు. లాన్‌లో మోదీ అడుగు పెట్టిన వెంటనే అక్కడున్న వారు పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. మోదీకి జైకొట్టారు.

ఆ సమయంలో మోదీ వెంట ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సిసబ కొరొసి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డిజిటల్ ఎవాంజలిస్ట్ వాలా ఆఫ్సర్, అవార్డ్ విన్నింగ్ స్టోరీ టెల్లర్ జై షెట్టి, భారత్‌కు చెందిన ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా, గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్, ఆఫ్రికన్- అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్.. తదితర ప్రముఖులు ఉన్నారు. వారందరూ ఈ యోగా సెషన్‌లో పాల్గొంటోన్నారు.
#WATCH | PM Narendra Modi at the UN Headquarters lawns in New York, to lead the Yoga event on the occasion of #9thInternationalYogaDay pic.twitter.com/1kwsr6OnJq
— ANI (@ANI) June 21, 2023
తొలుత- ఐరాసలో భారత రాయబారి రుచిర కాంబోజ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఐక్యరాజ్య సమితి వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలను జరుపుకోవడం ప్రత్యేక సందర్భంగా అభివర్ణించారు. ఈ విశ్వ వేదికపై యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక ఎత్తయితే- దీనికి ప్రధాని మోదీ స్వయంగా నాయకత్వం వహించడం మరో ఎత్తుగా పేర్కొన్నారు.
మోదీ చేసిన ప్రతిపాదనల మేరకే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించినట్లు రుచిర కాంబోజ్ గుర్తు చేశారు. అనంతరం ఎరిక్ ఆడమ్స్ మాట్లాడారు. సమస్త మానవాళికి, జీవజాలానికి, ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు మోదీ న్యూయార్క్‌లో ఉండటం- ఈ నగర ప్రథమ పౌరుడిగా గర్విస్తోన్నానని అన్నారు.
#WATCH | PM Narendra Modi pays tribute to Mahatma Gandhi at UN Headquarters lawns in New York, ahead of the Yoga event here that will be led by him#9thInternationalYogaDay pic.twitter.com/8PyFUsFJZt
— ANI (@ANI) June 21, 2023
సిసబ కొరొసి మాట్లాడుతూ- యోగా మన శారీరక పనితీరును మారుస్తుందని, విభిన్న మానసిక, శారీరక మేథో సంపత్తికి పదును పెడుతుందని అన్నారు. మానసికంగా ప్రతి ఒక్కరి ఆలోచనలు, వారి పనితీరును ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. సానుకూల దృక్పథాన్ని అనుసచించేలా ప్రేరేపించే శక్తి యోగాకు ఉందని అన్నారు. యోగాను తాను ఎంతగానో ఆరాధాస్తానని చెప్పారాయన. స్వీయ నియంత్రణను సాధించే సాధనాల్లో యోగా ఒకటిగా పేర్కొన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications