కరోనా: డొనాల్డ్ ట్రంప్‌కు పరీక్ష, 15 నిమిషాల్లోపే రిపోర్ట్.. రెండోసారి కూడా..

అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారు. ఈ సారి చేసిన పరీక్ష అత్యాధునిక పద్ధతిలో అబాట్ ల్యాబొరేటరీ నిర్వహించింది. 15 నిమిషాలు/ అంతకన్నా తక్కువ సమయంలోనే రిపోర్ట్ వచ్చింది. రెండోసారి పరీక్షలోనే ట్రంప్‌కు నెగిటివే వచ్చింది.

Recommended Video

    Trump Tested Again Uses New Diagnostic Kit, Result In 15 Minutes

    గతనెలలో బ్రెజిల్ అధికారితో సంప్రదింపులు జరిపాక.. కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారు ట్రంప్. అప్పుడు నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. రెండోసారి చేసిన పరీక్ష వేగంగా వచ్చిన.. తనలో మాత్రం టెన్షన్ తగ్గలేదని చెప్పారు. రెండోసారి కూడా ట్రంప్‌కు కరోనా వైరస్ నెగిటివ్ వచ్చింది.

    I Was Curious: Trump Uses New 15-minute Diagnostic Kit..

    కరోనా వైరస్ నుంచి తమనుతాము కాపాడుకొనేందుకు ప్రజలు మాస్క్ ధరించాలని ట్రంప్ కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా వైరస్ వివిధ మార్గాల ద్వారా వస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటు వ్యాధి కావడంతో అప్రమత్తతే శ్రీరామరక్ష అని చెప్తున్నారు. కేవలం ఫేస్ మాస్క్ పెట్టుకొని తమకు కరోనా వైరస్ రాదని చెప్పలేదని అంటున్నారు.

    వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో కొందరిని జైలు నుంచి విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ వారిలో కొందరు తీవ్రమైన నేరాలు చేయడంతో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. కరోనా వైరస్‌తో పోరాడుతున్న రోగులకు చికిత్స అందిస్తోన్న ఆసుపత్రులకు పరిహారం చెల్లించే ప్రణాళికను శుక్రవారం ట్రంప్ విడుదల చేస్తారని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+