హెచ్ 1బీ స్పాన్సర్‌షిప్‌ నిలిపివేసిన ఐబీఎం: అమెరికాను వీడటమో, రిజైన్ చేయడమో

టెక్ జెయింట్ ఐబీఎమ్ (IBM).. టెక్కీలకు బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వీసా స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసింది. గ్రీన్ కార్డులపైనా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డుల స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేస్తోన్నట్లు ప్రకటించింది. పెరిగిన హెచ్1బీ వీసా ఫీజు, పర్మ్ ప్రాసెస్ తనిఖీల కఠినతరం కావడం.. వంటి పరిణామాలను కారణంగా చూపిందా సంస్థ. ఈ నిర్ణయంతో.. ఈ ఏడాది చివరినాటికి అమెరికాలో పని చేస్తోన్న టెక్కీలు తీవ్రంగా ప్రభావితం కానున్నారు.

వారి ముందు రెండే మార్గాలు ఉండబోతోన్నాయి. అమెరికాను వీడి, ఇతర దేశాల్లో ఉన్న ఐబీఎం కార్యాలయాల నుంచి పనిచేయడం లేదా తమ ఉద్యోగానికి రాజీనామా చేయడం మినహా వేరే గత్యంతరం ఉండకపోవచ్చు. కన్సల్టింగ్ రంగానికి అవసరమైన టెక్ ప్రొఫెషనర్లు అమెరికాలోనే అందుబాటులోకి రావడం, సంస్థ కార్యకలాపాల తీరు, అవసరాలు మారడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐబీఎమ్ వెల్లడించింది.

IBM has ended H 1B visa and green card sponsorship for in its US consulting business leaves affected

దీనిపై బ్లూమ్ బెర్గ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సంస్థ ప్రతినిధిని తన కథనానికి ప్రాతిపదికన తీసుకుంది. కన్సల్టింగ్ విభాగంలో కొత్త హెచ్1 బీ దరఖాస్తులతో పాటు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఇచ్చే పర్మ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియను కూడా నిలిపివేసినట్లు ఐబీఎం ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. కొంతకాలంగా వీసా ప్రోగ్రామ్‌లపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చామని ఆయన పేర్కొన్నట్లు వివరించింది.

సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!
సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐబీఎమ్ సుమారు 1,100 హెచ్ 1బీ వీసాల కోసం దరఖాస్తు చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా వంటి ఇతర అమెరికన్ టెక్ దిగ్గజాలతో పోలిస్తే ఐబీఎమ్ దాఖలు చేసిన దరఖాస్తుల సంఖ్య చాలా తక్కువే. అయినప్పటికీ.. ఈ ప్రాసెస్ ను నిలిపివేసింది. కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు, భారతీయ ఐటీ నిపుణులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

విశాఖపట్నంలో జనసేనకు బిగ్ షాక్..!!
విశాఖపట్నంలో జనసేనకు బిగ్ షాక్..!!

హెచ్-1బీ వీసా విధానం, పర్మ్ ప్రాసెస్ తనిఖీలను అమెరికా తీవ్రతరం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఐబీఎమ్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగ అవకాశాలలో అమెరికన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో భారత్ సహా ఇతర విదేశీ ఉద్యోగులను నియమించే కంపెనీలపై ఆ దేశ యంత్రాంగం కఠిన నిఘా ఉంచింది. పర్మ్ మోసాల ఆరోపణలపై కొన్ని ప్రముఖ టెక్ సంస్థలు విచారణలు ఎదుర్కొంటున్నాయి కూడా.

ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటన- మొన్నటి ఓటమి సెగ
ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటన- మొన్నటి ఓటమి సెగ

అమెరికాలో విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ దక్కాలంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అనేది అత్యవసరం. తమ సంస్థలో ఉద్యోగం చేయడానికి తగిన అమెరికన్ అభ్యర్థులు లభించట్లేదని, అందుకే బయటి దేశాల నుంచి రప్పించుకోవాల్సి వస్తోందనే విషయాన్ని ఆయా కంపెనీల యజమానులు లేబర్ డిపార్టమెంట్ కు నిరూపించాల్సి ఉంటుంది.. ఈ ప్రక్రియ ద్వారా. ఇప్పుడు ఐబీఎమ్ దీన్నే రద్దు చేయడంతో ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల గ్రీన్ కార్డ్ కల నెరవేరడం మరింత సంక్లిష్టంగా మారింది.

గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందడం కష్టమౌతుంది. వీసా గడువు ముగిసిన తర్వాత అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదు. దీంతో ఆయా టెక్కీలు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం లేదా కెనడా, ఐరోపా వంటి ఇతర ప్రాంతాల్లోని కంపెనీ శాఖలకు మారడం వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+