• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచాన్ని బానిసలా: ఒక్కసారి మోకరిల్లితే: మన పిల్లలు కూడా చైనా దయాదాక్షిణ్యాల మీదే

|

వాషింగ్టన్: చైనాపై, ఆ దేశంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీపై అమెరికా నిప్పులు చెరిగింది. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడింది. తీవ్ర పదజాలంతో చెలరేగిపోయింది. ప్రపంచంపై పెత్తనం సాగించేలా చైనా కుట్ర పన్నుతోందంటూ మండిపడింది. ప్రపంచ దేశాలను బానిసలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఒక్కసారి చైనా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితే తలెత్తితే.. మన పిల్లల పిల్లలు కూడా ఆ దేశ కమ్యూనిస్టు పార్టీల దయాదాక్షిణ్యాల మీదే ఆధాపడి జీవించాల్సి వస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు.

రోనా కల్లోలంలోనూ: మార్స్‌పై చైనా రోవర్: రెడ్ ప్లానెట్‌పై వరుస ప్రయోగాలు: ఫస్ట్ ఎమిరేట్స్..

పీఎల్ఏ అందుకే..

పీఎల్ఏ అందుకే..

హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని మూసివేసిన సందర్భంగా మైక్ పాంపియో విలేకరులతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత దేశాలు చైనాను తమ దారిలోకి తెచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ అవకాశం చేజారితే మళ్లీ దక్కదనీ హెచ్చరించారు. చైనాను తమ దారికి గనక తెచ్చుకోలేకపోతే.. చైనానే స్వేచ్ఛాయుత దేశాలను తన దారిలోకి తీసుకెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి చైనా ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడితే.. తమ పిల్లల పిల్లలు కూడా కమ్యూనిస్టు పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించాల్సి వస్తుందని చెప్పారు.

 హ్యూస్టన్ కాన్సులేట్ మూసివేత అందుకే..

హ్యూస్టన్ కాన్సులేట్ మూసివేత అందుకే..

శతృదేశాల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించడానికి చైనా.. ఆయా దేశాల్లో ఉన్న కాన్సులేట్ జనరల్ కార్యాలయాలను వినియోగించుకుంటోందని మైక్ పాంపియో ఆరోపించారు. సప్లయ్ చైన్లులాగా వాటిని వాడుకుంటోందని మండిపడ్డారు. తమ దేశానికి చెందిన కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు ఆధారాలు లభించాయని, అందుకే హ్యూస్టన్ కాన్సులేట్‌ను మూసి వేయించాల్సి వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని చైనా కాన్సులేట్ కార్యాలయాలను మూసివేసే పరిస్థితి వస్తుందేమోనని పాంపియో వ్యాఖ్యానించారు.

అసాధారణ సైన్యం..

అసాధారణ సైన్యం..

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అసాధారణంగా వ్యవహరిస్తోందని పాంపియో అన్నారు. అత్యంత శక్తిమంతమైన సైన్యంగా తయారవుతోందని చెప్పారు. పీఎల్ఏ సాధారణ సైన్యం కాదనే విషయం తమకు తెలుసునని చెప్పారు. చైనా కమ్యూనిస్టు మహా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికే పీఎల్ఏ పని చేస్తోందని విమర్శించారు. తమ దేశ ప్రజల రక్షణ కోసం, సరిహద్దులను కాపాడుకోవడానికి కానే కాదని పాంపియో ఆరోపించారు. దక్షిణ, తూర్పు సముద్రం, తైవాన్ స్ట్రెయిట్‌పై ఆధిపత్యాన్ని చెలాయించడానికి చైనా కుట్ర పన్నుతోందని చెప్పారు.

  Love Indian, Chinese People, Want To Keep Peace - Trump || Oneindia Telugu
   జిన్‌పింగ్‌ను చైనాకే పరిమితం

  జిన్‌పింగ్‌ను చైనాకే పరిమితం

  చైనాకు, ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌ను చైనాకు మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం అన్ని దేశాలకు ఉందని పాంపియో అన్నారు. చైనా అంతర్గతంగా గానీ.. వెలుపల గానీ.. ఒక దిశా నిర్దేశం లేకుండా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించడం ఒక్కటే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు. ప్రపంచ ప్రజల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను హరించేలా చైనా కమ్యూనిస్టు పాలకులు నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పారు. చైనాను ఒంటరిగా ఎదుర్కొనలేమని, ఐక్యరాజ్య సమితి, నాటో, జీ7, జీ20 కూటమి దేశాలు చైనాపై ఆర్థికంగా, దౌత్యపరంగా, సైనికపరంగా ఒత్తిళ్లను తీసుకుని రావాలని సూచించారు.

  English summary
  US Secretary of State Mike Pompeo on Thursday once again attacked China over its expansionist policies and cover-up of COVID-19 outbreak and urged the international community to join hands in stopping Chinese Communist Party’s aggressive policies. Pompeo called on "free nations" to counter Chinese President Xi Jinping’s regime, whom he accused of being a "true believer" in the "bankrupt" totalitarian Marxist-Leninist ideology.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X