Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్రవాద రహిత శాంతిని కాంక్షిస్తున్నాం.. పాక్ ప్రధానికి మోడీ.. కంగ్రాట్స్ చెబుతూనే..

పాకిస్థాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ పదవీ ప్రమాణం చేశారు. దీంతో అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా విష్ చేశారు. కానీ తాము మాత్రం ఉగ్రవాద రహిత శాంతిని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్నామని చెప్పారు. పాక్ 23వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే షరీఫ్.. కశ్మీర్ గురించి మాట్లాడారు. ఆ వెంటనే ప్రధాని మోడీ స్పందించారు.

భారత్ అభివృద్ది, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దం అని మోడీ చెప్పారు. దేశ ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు గురించి షరీఫ్ కామెంట్ చేశారు. కశ్మీర్ లోయలో జనం ఇబ్బందులు పడుతున్నారని.. వారికి పాకిస్థాన్ దౌత్య, నైతిక మద్దతు అవసరం అని అభిప్రాయపడ్డారు. భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పుతామని చెబుతూనే.. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా అదీ సాధించలేమని చెప్పారు.

India desires peace in terror-free region: PM Modi tells new Pak pm

పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమైంది. పీటీఐ తరపునన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మొహమ్మద్ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో షెహబాజ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.

మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షెహబాజ్ షరీఫ్ తోపాటు ఆయన కుమారుడికి పాకిస్థాన్ కోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానానికి హాజరుతోపాటు అరెస్టుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ను పొడిగించింది కోర్టు. ఈ కేసును ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. దీంతో పీఎంఎల్(ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌కు ఉన్న అన్ని చిక్కులూ తొలగినట్లయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+