భారత్ ప్రయత్నం సఫలం: సీఏఏ వ్యతిరేక తీర్మానం నుంచి తప్పుకున్న ఒక ఎంఈపీ గ్రూప్

Recommended Video

    Citizenship Amendment Act : European Parliament Debates Anti CAA Motion || Oneindia Telugu

    లండన్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానాలపై బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంటులో బుధవారం చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ తీర్మానాలు ప్రవేశపెట్టిన ఐదు గ్రూపుల రాజకీయ పార్టీల సభ్యులను కలిసి వారికి సీఏఏ గురించి వివరించే ప్రయత్నం చేసింది.

    భారత్ చేసిన ప్రయత్నాలు కొంత మేర ఫలించాయనే చెప్పవచ్చు. 66 మంది సభ్యులు గల యూరోపియన్ కన్సర్వేటివ్స్, రిఫార్మిస్ట్స్(ఈసీఆర్) ఈ తీర్మానంకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో మిగితా ఐదు గ్రూపులు మాత్రమే తీర్మానంకు మద్దతుగా ఉన్నాయి. 751 మంది సభ్యుల్లో 560 మంది సభ్యులు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానంకు మద్దతు పలుకుతున్నారు. అయితే, చివరకు ఈ తీర్మానంకు ఎంత మంది మద్దతు ఇస్తారో తెలియదు.

    India had wooed pro-India MEPs to soften resolution

    23 మంది సభ్యుల యూరోపియన్ పార్లమెంటరీ బృందం ఇటీవల భారతదేశంలోపర్యటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇతర సీనియర్ అధికారులు వారిని కలిశారు. శ్రీనగర్‌లో పరిస్థితులను ఆ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఈ బృందానికి భారత అధికారులు ఇక్కడి పరిస్థితులను వివరించారు.

    కాగా, గత నెలలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్(యూఎన్‌హెచ్ఆర్‌సీ) భారతదేశం చేసిన చట్టం వివక్షను చూపేదిగా ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపైనా యూరోపియన్ పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది.
    యూఎన్, ఈయూ మార్గదర్శకాలు, మానవ హక్కులను పరిగణలోకి తీసుకుని తీర్మానంపై చర్చించనున్నారు.

    వివక్ష చూపే ఆ చట్టాన్ని విరమించుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరనుంది. సీఏఏ చట్టం ద్వారా కొందరిని వివక్ష పూరితంగా వ్యతిరేకించడం సరికాదని, అది విభజనకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులను కూడా సీఏఏలో చేర్చాలని కోరింది.

    ఇది ఇలావుంటే, భారతదేశం ఇప్పటికే యూరోపియన్ పార్లమెంటుకు ఖచ్చితమైన సమాధానమిచ్చింది. సీఏఏ తమ అంతర్గత విషయమని, దీనిపై జోక్యం సరికాదని స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో విదేశాలు కల్పించుకోవడం సరికాదని యూరోపియన్ పార్లమెంటుకు, విదేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓం బిర్లా తేల్చి చెప్పారు.

    అయితే, యూరోపియన్ పార్లమెంటులో రోజువారీ వ్యవహారాల్లో భాగంగా డ్రాఫ్ట్ రిజల్యూషన్స్ ప్రవేశపెడుతుంటారని.. ఇది కేవలం ఆయా రాజకీయ పార్టీలు ప్రాధాన్య అంశాలను తీసుకుని రూపొందించినవేనని ఈయూ అధికార ప్రతినిధి హెన్రిక్సన్ తెలపడం గమనార్హం. ఆయా తీర్మానాల్లో సభ్యులు అభిప్రాయాలు ఈయూ అధికార స్థానానికి మాత్రం ప్రాతినిథ్యం వహించవని తెలిపారు.

    కాగా, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు, వివక్షను ఎదుర్కొని అక్కడ బతకలేని స్థితిలో మనదేశానికి శరణార్థులుగా వచ్చిన మైనార్టీల(హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్ట్రియన్లు, ఇతర మైనార్టీలు)కు భారత పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎవరు వ్యతిరేకించినా దేశంలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+