హడావుడిగా భారతీయుల తరలింపు చేపట్టిన కేంద్రం- ట్రంప్ సైతం ఆదేశాలు
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ఉధృతమౌతోంది. వరుసగా అయిదో రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ లో నివసిస్తోన్న భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇజ్రాయెల్ యథేచ్ఛగా దాడులు సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం.. ఇరాన్ నుంచి రోడ్డు మార్గంలో వారిని తరలించనుంది. ఆర్మీనియాకు తీసుకెళ్లనుంది.
తొలి విడతలో వంద మంది భారతీయులు రోడ్డు మార్గంలో ఈ రాత్రికి ఇరాన్ సరిహద్దులను దాటుకునే అవకాశం ఉంది. తొలుత వాళ్లంతా కూడా ఆర్మీనియాకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానాల ద్వారా స్వదేశానికి బయలుదేరుతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో టెహ్రాన్ లో గల భారత రాయబార కార్యాలయం.. తాజా అడ్వైజరీని ఇచ్చింది. తమ సొంత వనరులను ఉపయోగించి టెహ్రాన్ నుండి బయటకు వెళ్లగల భారతీయులు దీనికి సిద్ధపడాలని సూచించింది. టెహ్రాన్ ను ఖాళీ చేసి సురక్షితమైన ప్రదేశానికి తరలి వెళ్లాలని కోరింది.
రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. టెహ్రాన్ లో నివసించదలిచిన భారతీయ పౌరులు తక్షణమే +989010144557, +989128109115, +989128109109 నంబర్లను సంప్రదించాలని రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో మరణించిన వారి సంఖ్య 224కు చేరుకుంది. వారిలో ఎక్కువమంది సాధారణ ప్రజలేనని ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 24 మంది మరణించారు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల దాదాపు 3,000 మందికి స్థానికులు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.
-
Iran: రూటు మార్చిన ఇరాన్-గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా వీరే కొత్త టార్గెట్..! -
యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే దిశగా పుతిన్! ట్రంప్‌తో సీక్రెట్ ప్లాన్? -
నో దోసె, నో పూరీ: బెంగళూరు పీజీల్లో రెండు పూటల మాత్రమే భోజనం -
PM Modi: గల్ఫ్ సంక్షోభం మనకు నేర్పుతున్న పాఠం-మోడీ కామెంట్స్..! -
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్‌పై ట్రంప్ సంచలన ప్రకటన! -
Warning: భయంకరమైన రోజులు రాబోతున్నాయి! -
LPG Crisis: గ్యాస్ వినియోగదారులకు సాయిరెడ్డి షాకింగ్ సలహా..! -
ఏపీలో కోడిగుడ్ల ధరలు పతనం..ఇరాన్- ఇజ్రాయెల్ వార్ తో సంబంధం! -
Bahrain: బహ్రెయిన్ లో తెలుగు వారికి గుడ్ న్యూస్..! నేటి నుంచే...! -
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ల బుకింగ్ పై కేంద్రం కీలకనిర్ణయం.. ధరలు ప్రియం! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన!












Click it and Unblock the Notifications