భారతీయులకు గండం! కేంద్రం రెడ్ అలర్ట్. రంగంలోకి ఎంబసీ.
పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎప్పుడు ఎగిసిపడతాయో తెలియని ఉత్కంఠ భరిత పరిస్థితుల నడుమ, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం (ఏప్రిల్ 8) అత్యంత కీలకమైన 'అడ్వైజరీ' జారీ చేసింది. అక్కడ ఉన్న భారతీయ పౌరులందరూ "వీలైనంత త్వరగా" దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని గట్టిగా సూచించింది.
ఏప్రిల్ 7న ఇచ్చిన హెచ్చరికను మరింత తీవ్రతరం చేస్తూ, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత పౌరులు తమ ఇష్టానుసారం అంతర్జాతీయ భూ సరిహద్దులను దాటడానికి ప్రయత్నించవద్దని ఎంబసీ హెచ్చరించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నందున, రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే వారు సూచించిన సురక్షిత మార్గాల ద్వారా దేశం దాటాలని కోరింది.

ఎంబసీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఈ మేరకు ప్రత్యేక మొబైల్ నంబర్లు మరియు ఈమెయిల్ హెల్ప్‌లైన్‌లను కూడా భారతీయుల కోసం సిద్ధం చేసింది.
కాల్పుల విరమణ ఉన్నా.. తగ్గని టెన్షన్!
అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వం మాత్రం దాన్ని పూర్తిస్థాయి శాంతిగా పరిగణించడం లేదు. సరిహద్దుల్లో సైనిక కదలికలు, అంతర్గత అనిశ్చితి భారతీయుల ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, విమాన సర్వీసులు లేదా అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించుకుని త్వరితగతిన స్వదేశానికి చేరుకోవాలని భారతీయులను కోరుతోంది.
దేశం కాని దేశంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న వేలాది మంది భారతీయ కార్మికులు, విద్యార్థులు మరియు పర్యాటకులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు
Advisory in view of the rapidly evolving situation in Iran ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) April 7, 2026
🔗 https://t.co/wyWOCzDfsZ pic.twitter.com/95JN4LxC9P












Click it and Unblock the Notifications