"భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది"

భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. అయితే ఈ యుద్ధ విమానం అత్యధిక ఎత్తులో ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నేల కూలిందని అన్నారు. పాకిస్థాన్ జరిపిన దాడిలో మాత్రం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వివరించారు. మరోవైపు పాకిస్థాన్ మాత్రం ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత్ ఎయిర్ క్రాఫ్ట్ లను ధ్వంసం చేశామని వాటిలో రఫేల్ కూడా ఉందని చెప్పుకొచ్చింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను ఇప్పటికే సీడీఎస్ అనిల్ చౌహాన్ ఖండించారు.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దాదాపు ఐదు రోజులపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్ దాడులను తిప్పి కొట్టేందుకు తాము చేపట్టిన ప్రతి దాడిలో భారత్ కు చెందిన ఆరు యుద్ధ విమానాలను తాము ధ్వంసం చేశామని.. అందులో రఫేల్ కూడా ఉందని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది. పాక్ వ్యాఖ్యల్ని గతంలోనే సీడీఎస్ అనిల్ చౌహాన్ ఖండించారు. అయితే తాజాగా భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ వెల్లడించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

'భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది. అయితే ఈ ఘటన ట్రైనింగ్ సమయంలో జరిగింది. రఫేల్ విమానం 12,000 మీటర్ల ఎత్తులో విన్యాసాలు చేస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. అంతేకానీ పాకిస్థాన్ లేదా ఇతర దేశం జరిపిన దాడుల్లో మాత్రం కాదు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది' అని డసాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు.

India Loses Rafale Jet Dassault CEO Eric Trappier Confirms Technical Failure

అయితే భారత వైమానిక దళం మాత్రం ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల సీడీఎస్ అనిల్ చౌహాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న మాట వాస్తవమే. కానీ భారత్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్స్ ను కూల్చేశామని.. అందులో రఫేల్ కూడా ఉందని పాకిస్థాన్ చెబుతోంది. ఈ వార్తలు అవాస్తవం. అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు.

మరోవైపు చైనా మాత్రం ఇదే అదునుగా భావించి రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసిన ఫ్రాన్స్, వాటిని వినియోగిస్తున్న భారత్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది. రఫేల్ యుద్ధ విమానాలు నాసి రకం అని పాకిస్థాన్ జరిపిన దాడిలో అవి ధ్వంసం అయ్యాయని విష ప్రచారం చేస్తోంది. భారత్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఆయుధాలు ఎవరూ కొనొద్దంటూ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. అందుకు బదులుగా తమ ఆయుధాలను కొనుగోలు చేయాలని పిలుపునిస్తోంది డ్రాగన్. ఇలా భారత్ రక్షణ వ్యవస్థను దెబ్బతీయాలని చైనా ప్లాన్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+