తాలిబాన్లతో ఇండియా చర్చలు: సురక్షితంగా తరలింపు, ఉగ్రవాదంపై డిస్కషన్

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల అరాచక పాలన కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు కాబుల్ విమానాశ్రయంలో అమెరికా సేనలు ఉండేవి. ఒప్పందం ప్రకాశం ఆగస్ట్ 31వ తేదీన అమెరికా బలగాలు తరలిపోయాయి. ఈ మేరకు తాలిబాన్లు అధికార ప్రకటన కూడా చేశారు. అమెరికా ఆప్ఘనిస్తాన్ మధ్య గత 20 ఏళ్లుగా యుద్దం జరుగుతుందని పేర్కొన్నది. మరోవైపు తమ చివరి సైనికుడు తరలివచ్చే దృశ్యాన్ని అమెరికా కూడా షేర్ చేసుకుంది. ఆర్మీ మేజర్ జనరల్ క్రిస్ తరలింపును షేర్ చేశారు.

అమెరికా సేనలు వెళ్లాక.. శాంతి, భద్రత, అనిశ్చితి తొలగిపోయినట్టేనని తాలిబాన్లు ప్రకటన చేశారు. మరోవైపు ఆప్ఘనిస్తాన్‌తో భారత్ తొలిసారి ద్వైపాక్షిక చర్చలు జరిపింది. భారత రాయబారి.. దోహలో తాలిబాన్ ప్రతినిధితో సమావేశం అయ్యారు. దీపక్ మిట్టల్.. షెర్ మహ్మ్ అబ్బాస్ స్టేనెకజాల్‌తో భేటీ అయ్యారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివరాలను వెల్లడించింది.

 India Officially Talks To Taliban, Raises Safe Evacuation, Terrorism

ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న పౌరుల భద్రత.. మైనార్టీల గురించి డిస్కస్ చేశారు. ఆప్ఘన్ నేలపై భారతీయతకు వ్యతిరేక కార్యకలపాలకు అంగీకరించబోమని మిట్టల్ స్పష్టంచేశారు. అదీ ఉగ్రవాదం.. మరే రూపం అయినా సరేనని స్పష్టంచేశారు. తాలిబాన్ ప్రతినిధి.. 1979 నుంచి 1982 మధ్య భారత ఆర్మీలో శిక్షణ పొందినవారు కావడం విశేషం. డెహ్రడూన్‌లో గల మిలిటరీ అకాడమీలో ఆర్మీ క్యాడెట్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకున్నారు.

Recommended Video

    Talibans ఆ విమానాలన్నీ తమకే అనుకున్నారు.. US Army పంచ్ | Afghanistan || Oneindia Telugu

    ఇటీవల కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన పేలుళ్లలో 100 మందికి పైగా చనిపోయారు. 13 మంది అమెరికా సైనికులు కూడా చనిపోయారు. ఆత్మాహుతి దాడికి సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది.. ఇద్దరు ముష్కరులను అమెరికా దళాలు శనివారం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. తమ సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని అమెరికా ప్రతీనబూనింది. ఆ మేరకు వైమానిక దాడులకు దిగింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+