భారత్ కు బంగ్లా మరో షాక్..! ఇస్లామిక్ నాటోలో చేరికపై క్లారిటీ..!

ఇరాన్ వార్ తర్వాత పశ్చిమాసియాతో పాటు అంతర్జాతీయంగానూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వార్ కంటే ముందే జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్-సౌదీ అరేబియా కలిసి మక్కా రక్షణ ఒప్పందం (Mecca Defence Agreement) చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ రెండు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా అది ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణించి ఉమ్మడి శత్రువుపై దాడి చేస్తాయి. ఇరాన్ వార్ తర్వాత ఈ కూటమిలోకి టర్కీ కూడా చేరింది. అప్పటికే ఆపరేషన్ సింధూర్ లో భారత్ (india)పై దాడులకు పాకిస్తాన్ (Pakistan)కు సాయం చేసిన టర్కీ ఇందులో చేరడంతో ఈ కూటమిలో ముగ్గురు సభ్యులయ్యారు. ఇప్పుడు మరిన్ని దేశాలు దీనివైపు చూస్తున్నాయి.

భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!
భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!

ఇందులో ఈజిప్ట్ ముందుగా ఈ త్రిసభ్య కూటమిలో చేరుతుందని భావించినా భారత్ తో ఉన్న సంబంధాల నేపథ్యంలో చివరి నిమిషంలో వెనకడుగు వేసింది. కానీ భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) మాత్రం ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు సానుకూలత వ్యక్తం చేసారు. ఇస్లామిక్ నాటోగా భావిస్తున్న ఈ మక్కా రక్షణ ఒప్పంద కూటమిలో చేరడం ద్వారా భవిష్యత్తులో భారత్ సహా ఇతర పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పుల్ని ఎదుర్కోవాలని బంగ్లాదేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

India on Alert Bangladesh Signals Interest in Pakistan-Saudi-Turkey Mecca Defence Pact
పాకిస్తాన్ కూటమికి భారత్ ఝలక్..! ఈజిప్ట్ నిర్ణయం వెనుక ?
పాకిస్తాన్ కూటమికి భారత్ ఝలక్..! ఈజిప్ట్ నిర్ణయం వెనుక ?

తమ దేశ సరిహద్దుల భద్రతతో పాటు రక్షణ రంగ ప్రయోజనాలను మరింత బలోపేతం చేసుకోవడమే ప్రాతిపదికగా ఈ చారిత్రక అంతర్జాతీయ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. బంగ్లాదేశ్ కొత్త విదేశాంగ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ ఈ తాజా పరిణామాలపై అధికారికంగా స్పందించారు. కొత్తగా కొలువుదీరిన తమ ప్రభుత్వం అమలు చేస్తున్న బంగ్లాదేశ్ ఫస్ట్ విధానంలో భాగంగానే ఈ రక్షణ కూటమి వైపు ముందడుగు వేయడానికి మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి శమా ఒబైద్ ఇస్లాం కూడా ఏ రక్షణ కూటమిలో చేరాలన్నా లేదా ఇతర అంతర్జాతీయ సంస్థతో కొత్త భాగస్వామ్యాలు నెలకొల్పాలన్నా తాము తీసుకునే తుది నిర్ణయాలు పూర్తిగా దేశ ప్రజల భద్రత, వారి సార్వభౌమత్వ సంక్షేమంపైనే సంపూర్ణంగా ఆధారపడి ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు బంగ్లా ప్రధాని తారిఖ్ రెహమాన్ త్వరలో రియాద్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ బంగ్లా చేరికపై మరింత క్లారిటీ రానుంది. ఈ పరిణామం భారత్ కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+