బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా ఫక్రుల్- భారత్ కు గుడ్ న్యూస్-హసీనాకు షాక్..!

భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో గతేడాదితో పోలిస్తే పరిస్ధితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయంతో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్ష పదవీకాలం ముగియడంతో ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. వీటిలో కొత్త అధ్యక్షుడిగా అధికార పార్టీ నేత మీర్జా ఫక్రుల్ ఆలంగీర్ (Mirza Fakhrul Alamgir) ఎన్నికయ్యారు. విపక్షాలు నిలబెట్టిన అభ్యర్ధిపై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో ఆయన వ్యవహరించే తీరు కీలకంగా మారబోతోంది.

భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!
భారత్ కు బంగ్లా భారీ షాక్..! చైనా చేతికి ఆ కీలక పోర్టు..!

దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ లో పోటాపోటీగా జరిగిన మొదటి అధ్యక్ష ఎన్నికలు ఇవే. వీటిలో అధికార బీఎన్పీ అభ్యర్ది అయిన 78 ఏళ్ల ఆలంగీర్.. తన సమీప ప్రత్యర్థి, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఓలీ అహ్మద్‌పై ఘన విజయం సాధించారు. ఆలంగీర్‌కు 255 ఓట్లు రాగా, ఓలీ అహ్మద్‌కు కేవలం 88 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎంఎం నసీరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం బంగ భవన్ దర్బార్ హాల్‌లో ఆలంగీర్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల అనారోగ్య కారణాలతో మహ్మద్ షహబుద్దీన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

Mirza Fakhrul Alamgir Who Is Bangladesh s New President and What Is His Stand on India
భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!
భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!

రాజకీయాలోకి రాక ముందు ఆలంగీర్ టీచర్ గా పనిచేసారు. ఢాకా యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆయన, 1990లలో బీఎన్పీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గత షేక్ హసీనా సుదీర్ఘ పాలనా హయాంలో ఆయన గట్టి ప్రతిపక్ష స్వరంగా నిలిచారు. ఆ సమయంలో పలుమార్లు అరెస్ట్ అయినా, పార్టీని సమర్థవంతంగా నడిపించి నమ్మకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. మరోవైపు భారత్‌ను బంగ్లాదేశ్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగిన పొరుగు దేశంగా, మంచి మిత్రుడిగా అభివర్ణించినప్పటికీ.. దేశ సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవాలని గతంలో ఆలంగీర్ కోరారు. భారత అంతర్గత రాజకీయాల్లో జరిగే ప్రచారాలు ద్వైపాక్షిక సంబంధాలకు అడ్డంకిగా మారకూడదని ఆయన తెలిపారు. పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కాపాడుకుంటూనే తమ ప్రజాస్వామ్య ఆకాంక్షలను కాపాడాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q