ట్రంప్ కు బిగ్ షాక్.. ఒక్కటైన చైనా, భారత్..!
భారత్, చైనా మధ్య 2020 జూన్ 15న గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ దాడుల్లో భారత్ కు చెందిన 20 మంది సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అయ్యాయి. ఈ క్రమంలోనే చైనా దేశస్థులకు భారత్ టూరిస్టు వీసాల జారీని నిలిపివేసింది. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తో ఇటీవల సమావేశం జరిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన జై శంకర్.. చైనాతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే భారత్, చైనా మధ్య సత్సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత చైనీయులకు భారత్ టూరిస్టు వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.
కొవిడ్-19, 2020 గల్వాన్ ఘర్షణలు తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అయితే దాదాపు ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటించారు. ఈ మేరకు చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తో కీలక సమావేశం నిర్వహించారు. దీంతో ఇరు దేశాలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే దాదాపు ఐదేళ్ల తర్వాత చైనీయులకు భారత్ టూరిస్టు వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.
India will resume issuing tourist visas to Chinese citizens from July 24 this year, its embassy in China, the first time in five years as both countries move to repair their rocky relationship https://t.co/5LOCkAUpgK
— Reuters (@Reuters) July 23, 2025
చైనాలోని భారత రాయబార కార్యాలయం తన స్టేట్ మెంట్ లో.. చైనా దేశస్థులు భారత్ లో టూరిస్టు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. చైనాలోని ప్రధాన నగరాల్లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్లలో పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్స్ సమర్పించాలి. జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరు చేయడం జరుగుతుంది. అని చైనాలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. అంతేకాక ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31-సెప్టెంబర్ 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతన్, ఎస్‌సీఏ సభ్య దేశాల నేతలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. దీంతో భారత్, చైనా, రష్యా ఒకే థాటిపైకి వచ్చి ఆంక్షలు, టారిఫ్ లు విధిస్తున్న అమెరికాకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై ఇటీవల చైనా, భారత్ లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి డిస్కౌంట్ లో ముడి చమురు, గ్యాస్ ను కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను టార్గెట్ చేశారు. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు 500 శాతం టారిఫ్ లు విధిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications