అణ్వస్త్రాల వివరాలు పంచుకున్న భారత్-పాకిస్తాన్-పరస్పరం దాడి చేయరాదనే షరతుతో
దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ లు ఇవాళ ఓ కీలక అడుగు వేశాయి. ఇరుదేశాల మధ్య ఎప్పుడూ వివాదాస్పదమయ్యే అణ్వస్త్ర స్దావరాలకు సంబంధించిన వివరాలను పరస్పరం పంచుకున్నాయి. అదీ నేరుగా కాకుండా దౌత్య మార్గాల్లో కావడం మరో విశేషం. ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఏకకాలంలో దౌత్య మార్గాల ద్వారా భారత్, పాకిస్తాన్ తమ అణు స్థావరాల జాబితాను పరస్పరం మార్చుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అణు స్థాపనలు, సౌకర్యాలపై దాడి నిషేధంపై ఒప్పందం ప్రకారం, భారత్, పాకిస్తాన్ రెండూ ఒకరికొకరు అణు కేంద్రాలపై దాడి చేయకుండా నిషేధించే ప్రయత్నంలో అణు స్ధావరాలు, సౌకర్యాల గురించి పరస్పరం వివరాలు అందించుకున్నాయి.
భారత్, పాకిస్తాన్ మధ్య అణు స్ధావరాలు, సౌకర్యాలపై దాడి నిషేధంపై ఒప్పందం కింద ఉన్న అణు స్ధావరాలు, సౌకర్యాల జాబితాను ఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఏకకాలంలో దౌత్య మార్గాల ద్వారా భారత్, పాకిస్తాన్ ఇవాళ పరస్పరం మార్చుకున్నాయి. 1988 డిసెంబర్ 31న తొలిసారి సంతకం చేసి 1991 జనవరి 27న అమల్లోకి వచ్చినప్పటి నుంచి 31 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇలా అణ్వస్త్ర స్దావరాల సమాచారం ఇరుదేశాలు పంచుకోవడం ఇది 32వ సారి కావడం విశేషం.

భారత్, పాకిస్తాన్ లోని అణ్వస్త్రాల భద్రతపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా ఈ అణ్వస్త్రాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని భారత్ కోరుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాలూ ఏటా ఈ సమాచారాన్ని పంచుకుంటున్నాయి. తద్వారా ఎలాంటి అపోహలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నాయి.












Click it and Unblock the Notifications