భారత్! పెద్దన్న పాత్ర పోషించాలి: ఆ సత్తా ఉందన్న వైట్ హౌస్

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్ పెద్దన్న పాత్రను పోసించాలని వైట్ హౌస్ అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఆసియా దేశాల పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో వైట్‌హౌస్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 ఆసియా దేశాలే.. కానీ భారత్ లేదు..

ఆసియా దేశాలే.. కానీ భారత్ లేదు..

జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల్లో ట్రంప్ 12రోజులపాటు పర్యటించనున్నారు. అయితే, ఈ పర్యటనలో ఆయన భారత్‌కు రావడం లేదు. ట్రంప్ ఆసియా దేశాల పర్యటనకు సంబంధించిన వివరాలను వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు.

ఉబెర్ డ్రైవర్ నుంచి ఉగ్రవాదిగా.. 8మంది ప్రాణాలు తీసిన సైపుల్లా, అంతకుముందు ఇలా..

హడావుడిగా భారత్ రావడం ఇష్టం లేదు..

హడావుడిగా భారత్ రావడం ఇష్టం లేదు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత పర్యటన లేకపోవడంపై ఆమె స్పందిస్తూ.. భారత్‌తో ఉన్న బలమైన బంధం దృష్ట్యా.. హడావుడి షెడ్యూల్‌తో అక్కడకు వెళ్లేందుకు ట్రంప్ ఇష్టపడటం లేదని చెప్పారు.

వాహనాలే ఉగ్రవాదులకు ఆయుధాలు: ఊహించని దాడులతో ప్రాణాలు తీస్తున్నారు

 పెద్దన్న పాత్ర పోషించాలి..

పెద్దన్న పాత్ర పోషించాలి..

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్ పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ రీజియన్‌లో అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన, వ్యూహాత్మక భాగస్వామి అని శాండర్స్ పేర్కొన్నారు.

 ఆ సత్తా భారత్‌కు ఉంది..

ఆ సత్తా భారత్‌కు ఉంది..

కొంతకాలంగా భారత్‌తో అమెరికా వ్యూహాత్మక, రక్షణ, ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకుంటోందని వివరించారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌తోపాటు మొత్తం ప్రపంచానికి శాంతిని ఇవ్వగలిగే సత్తా భారత్‌కు ఉందని శాండర్స్ స్పష్టం చేశారు. కాగా, భారత్ పర్యటనకు ట్రంప్ ప్రత్యేకంగా మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ahead of President Donald Trump's maiden Asia trip, the White House said today India plays a "big role" in the Indo-Pacific region. Trump embarks on a 12-day trip later this week to visit Japan, South Korea, China, Vietnam and Philippines. He will not be paying a visit to India this time.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి