2038 నాటికి జగజ్జేతగా భారత్.. వెంట్రుక కూడా పీకలేరు..!

ప్రస్తుతం భారత్ పై అమెరికా సుంకాల మోత మోగిస్తోంది. ఏ దేశానికీ లేనంతగా భారత్ పై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించింది అమెరికా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల కారణంగా భారత పరిశ్రమలకు, ఎగుమతి దారులకు కష్టాలు తప్పవు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు తద్వారా అటు భారత్ తో పాటు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టేందుకు ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు.

ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే ఇలాంటి ఒడిదుడుకుల సమయంలో భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది EY రిపోర్టు. 2038 నాటికి భారత్.. కొనుగోలు శక్తి సమానత్వం purchasing power parity (PPP)లో ప్రపంచంలోనే రెండో స్థానంలోకి చేరుకుంటుందని అంచనా వేసింది.

ప్రస్తుతం జీడీపీ ప్రకారం భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల పేర్కొంది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ విలువ 2025 నాటికి 4.27 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు స్పష్టం చేసింది. అలాగే 2025 నాటికి జపాన్, 2027 నాటికి జర్మనీను అధిగమించి 2038 నాటికి రెండో స్థానంలోకి చేరుతుందని EY రిపోర్టు అంచనా వేసింది. ప్రస్తుతం 30. 34 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తొలి స్థానంలో ఉంది. చైనా, జర్మనీ, జపాన్, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. భారత్ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి.


2038 నాటికి భారత జీడీపీ విలువ 34. 2 ట్రిలియన్ వరకు చేరుకుంటుందని రిపోర్టు వెల్లడించింది. ఐఎంఎఫ్ నిర్దేశించిన లక్ష్యాల ఆధారంగా ఈ విలువను ఈవై సంస్థ అంచనా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2025 నాటికి 28.8 మీడియాన్ రేంజ్ లో ఉంది. సేవింగ్స్ రేట్ లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. డెట్ టూ జీడీపీ రేషియో 2024 లో 81.3 శాతం ఉండగా 2030 నాటికి 75.8 శాతానికి చేరుకుంది.

అలాగే 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం purchasing power parity (PPP)లో చైనా తొలిస్థానంలోకి చేరుకుంటుందని ఈవై సంస్థ అంచనా వేసింది. చైనా జీడీపీ విలువ 42.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని స్పష్టం చేసింది. అమెరికా శక్తివంతంగానే ఉన్నప్పటికీ డెట్ రేషియో భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. అది అమెరికా జీడీపీలో 120 శాతం ఉంటుందని పేర్కొంది.

India Set to Be World s Second-Largest Economy by 2038 Says EY Report

ఇదే విషయంపై ఈవై సంస్థ చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీ వాస్తవ మాట్లాడుతూ.. భారత్ లోని యువత, నైపుణ్యమైన ఉద్యోగులు, సేవింగ్స్, పెట్టుబడుల రేట్లు, తదితర కారణాల వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నా భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని తెలిపారు. భారత్ నిర్దేశించిన 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకుంటుందని స్పష్టం చేశారు. అమెరికా విధించిన సుంకాలు భారత్ జీడీపీలోని 0.9 శాతంపై ప్రభావం చూపుతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+