Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీకి యూఏఈ అధ్యక్షుడి ఆత్మీయ స్వాగతం: అత్యున్నత పురస్కారం, యూపీఐ సేవలు షురూ

అబుదాబీ: యూఏఈ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల అధినేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ యూఏఈ సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం అబుదాబీకి చేరుకున్నారు.

అనంతరం ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, డిజిటల్ రంగాల్లో సంబంధాలు విస్తరణపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తదితరులు పాల్గొన్నారు.

India, UAE Partners In Progress; Time To Hail Our Friendship: PM At Indian Diaspora Event, highest honor for Modi

ఆ తర్వాత యూఏఈ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోడీ ఆ దేశంలో యూపీఐ(UPI) రూపే కార్డు సేవలను ప్రారంభించారు. అక్కడి స్థానిక కార్డు అయిన జయవాన్ కార్డ్‌తో భారత్ రూపే కార్డును లింక్ చేశారు. అబుదాబీలో రూపే జయవాన్ కార్డుల సేవలు ప్రారంభం సందర్భంగా తన పేరుతో ఉన్న కార్డును యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయేద్ స్వైప్ చేశారు. అనంతరం అంతేనా అన్నట్లు నవ్వారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు చిరునవ్వులు చిందించారు. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రదాని మోడీ ఏడుసార్లు యూఏఈలో పర్యటించడం గమనార్హం.

సోదరుడికి ధన్యవాదాలంటూ మోడీ

'నాకు సాదర స్వాగతం పలికిన సోదరుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఏడు నెలల్లో మేము ఐదుసార్లు కలుసుకున్నాం. ఇది చాలా అరుదు. నేను కూడా ఇక్కడకు ఏడు సార్లు వచ్చే అవకాశం వచ్చింది. మేం ప్రతి రంగంలో ఎలా అభివృద్ధి సాధించామో, అక్కడ భారత్​, యూఏఈ మధ్య ఉమ్మడి భాగస్వామ్యం ఉంది' అని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు, 'సమయం వెచ్చించి మరీ నన్ను రిసీవ్​ చేసుకోడానికి ఎయిర్​పోర్టుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞుడిని. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా ఇంటికి, నా కుటుంబాన్ని కలిసినట్టు అనిపిస్తుంది' అని ట్వీట్ చేశారు.

'భారత్‌​తో మీకున్న అనుబంధానికి అదే నిదర్శనం' యూఏఈలో బాప్స్​ మందిరం ఉండటం భారత్​‌పై మీకు(యూఏఈ అధ్యక్షుడు జాయేద్) ఉన్న అనుబంధానికి నిదర్శనం అని ప్రధాని మోడీ అన్నారు. యూఏఈ నాయకత్వం మద్దతు లేకుండా అబుదాబిలో ఆ ఆలయ నిర్మాణం సాధ్యమయ్యేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

అహ్లాన్ మోడీ

అబుదాబీలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించిన అహ్లాన్ మోడీ కార్యక్రమంలో భాగంగా తరలివచ్చిన వేలాది మంది ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారని, 140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇక్కడ ప్రతిఒక్కరి ప్రతిశ్వాస, గుండె చప్పుడు, స్వరం.. 'భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్' అని నినదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు.

అంతకుముందు ఐఐటీ ఢిల్లీ-అబుదాబీ క్యాంపస్ తొలి బ్యాచ్ విద్యార్థులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. యూఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఓ హోటల్‌కు వెళ్లిన ప్రధానమంత్రి మోడీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. వారి చైతన్యాన్ని ప్రశంసిస్తూ మోడీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

బాప్స్ మందిరం ప్రారంభించనున్న ప్రధాని మోడీ

ఫిబ్రవరి 14న వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోడీ. అదే రోజు బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ నిర్మించిన హిందూ ఆలయాన్ని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం ఖతార్‌ దేశానికి వెళ్లనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+