ఇండియాకు నో టెన్షన్.. సుంకాల పోరులో ట్రంప్ తగ్గాల్సిందే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గానూ ఇండియాపై 50 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రకటన ప్రకారం.. భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయి. అయితే దీని వల్ల భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సుంకాల కారణంగా అమెరికాలో భారతీయ వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ చర్య భారత్-అమెరికా మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉన్నప్పటికీ, భారత్ ప్రజలపై దాని ప్రభావం తక్కువగా ఉంటుంది.

ట్రంప్ విధించిన సుంకాల వల్ల భారత్ కంటే అమెరికాకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సుంకాలో పోరులో ట్రంప్ తన కాళ్లపై తానే గొడ్డలి పెట్టుకున్నారని.. భారత్ గట్టిగా నిలబడితే అమెరికానే వెనక్కి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సుంకాలపై భారత్ గట్టిగా స్పందించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్య అన్యాయమైనదని, అసంబద్ధమైనదని, తార్కికం లేనిదని తీవ్రంగా ఖండించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ తన రైతులకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో రాజీపడదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు భారత్ తన విధానాలపై స్థిరంగా నిలబడుతుందని సూచిస్తున్నాయి.

India Unfazed Trump s Tariff Threat Faces Strong Pushback

అమెరికాకు నష్టాలు.. నిపుణుల విశ్లేషణ
ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల భారత్‌కు కొంత నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, అమెరికాకు జరిగే నష్టం అంతకంటే ఎక్కువ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే చవకైన ముడిసరుకు, ఎలక్ట్రానిక్స్(ముఖ్యంగా ఐఫోన్ విడిభాగాలు)పై ఆధారపడిన అమెరికన్ కంపెనీలు భారీగా ప్రభావం అవుతాయి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది, తద్వారా ఆపిల్ వంటి కంపెనీల ప్రపంచ పోటీతత్వం దెబ్బతింటుంది. అమెరికా భారత్ నుంచి దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. సుంకాల వల్ల ఈ ఔషధాల ధరలు పెరిగి అమెరికన్ పౌరులకు ఆరోగ్య సంరక్షణ ఖర్చు పెరుగుతుంది. భారతీయ ఉత్పత్తులపై ఆధారపడిన చిన్న అమెరికన్ వ్యాపారాల లాభాలు తగ్గుతాయి. ఎందుకంటే దిగుమతి వ్యయాలు పెరుగుతాయి.

భారత్ తన వైఖరికి కట్టుబడి ఉంటే, ట్రంప్ వెనక్కి తగ్గవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేస్తూ, ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని నాటో సలహాదారు ఎఫ్ క్రిస్టల్ కౌర్ అన్నారు. ఈ నిర్ణయం కేవలం ట్రంప్ శక్తిని ప్రదర్శించే పద్ధతి అని ఆమె విమర్శించారు.

భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం
ట్రంప్ సుంకాల ఆటతో భారత్-అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిసారిగా చైనాను సందర్శించనున్నారు. దీంతో అమెరికాకు దూరం, చైనాతో సాన్నిహిత్యం పెరుగుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+