Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా గర్వాన్ని అణచిన భారత్.. ట్రేడ్ డీల్ వెనుక అసలు రహస్యం ఇదే!

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ తన విజయంగా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. తెర వెనుక జరిగిన చర్చలు మరోలా ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ట్రంప్, భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ వెనుక ఉన్న వాస్తవాలను బయటపెడుతూ బ్లూమ్‌బెర్గ్ ఓ సంచలన నివేదికను విడుదల చేసింది. అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, ట్రంప్ సన్నిహితుల విమర్శల నేపథ్యంలో భారత్ తన పట్టు సడలించలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఒప్పందం కోసం భారత్ ఏమాత్రం తలవంచలేదని.. అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ స్పష్టం చేసినట్లు ఈ నివేదిక వెల్లడించింది.

ఆ చర్చల్లో అజిత్ ధోవల్ ఏమన్నారు?
సెప్టెంబర్ 2025లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరిగిన ఒక రహస్య భేటీలో ధోవల్ తన గళాన్ని బలంగా వినిపించారు. "భారత్ ఎప్పుడూ అమెరికా ఒత్తిడికి లొంగదు. గతంలో కూడా మేము ప్రతికూల అమెరికా ప్రభుత్వాలను ఎదుర్కొన్నాం. ఒకవేళ మీ వైఖరి మారకపోతే, వాణిజ్య ఒప్పందం కోసం 2029లో ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూడటానికి కూడా మేము సిద్ధం" అని అజిత్ ధోవల్ స్పష్టం చేసినట్లు సమాచారం.

India-US Trade Deal Secrets NSA Ajit Doval Told US That India Will Wait for Donald Trump Exit

వివాదానికి నేపథ్యం ఏంటి?
మే 2025లో భారత్-పాకిస్థాన్ యుద్ధం సమయంలో ట్రంప్ చేసిన సంధి ప్రతిపాదనలను భారత్ తోసిపుచ్చింది. దీనిపై ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం, భారత ఎగుమతులపై ఏకంగా 50 శాతం టారిఫ్ (పన్ను) విధించింది. అంతేకాకుండా ట్రంప్ సలహాదారు నవారో వంటి వారు ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఉక్రెయిన్ యుద్ధాన్ని "మోదీ యుద్ధం" అని కూడా అభివర్ణించారు.

ఒత్తిడికి తలొగ్గని భారత్
అమెరికా చేస్తున్న బెదిరింపు ధోరణిని భారత్ ఎంతమాత్రం సహించబోదని అజిత్ ధోవల్ తేల్చి చెప్పారు. ట్రంప్, ఆయన అధికారులు బహిరంగంగా భారత్‌ను విమర్శించడం ఆపితేనే సంబంధాలు మెరుగుపడతాయని మార్కో రూబియోకు సూచించారు. ఈ భేటీ తర్వాతే ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని, సెప్టెంబర్ చివరిలో ప్రధాని మోదీ పుట్టినరోజున ఆయన స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని నివేదిక పేర్కొంది.

వ్యవసాయ రంగమే భారత్ 'రెడ్ లైన్'
ప్రస్తుతం కుదిరిన ట్రేడ్ డీల్‌ను అమెరికా రైతుల విజయంగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. అయితే, భారత్ తన వ్యవసాయ, డెయిరీ రంగాలను ఎప్పుడూ తన 'రెడ్ లైన్' (నిబంధనలు అతిక్రమించని అంశం)గా పరిగణిస్తుంది. విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ ఒప్పందం వివరాలను ప్రభుత్వం ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. కానీ అజిత్ ధోవల్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే భారత్ తన ప్రయోజనాలను పణంగా పెట్టకుండానే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+