భారత్ కు షాకిచ్చిన ట్రంప్.. వాణిజ్య ఒప్పందంపై చివర్లో ట్విస్ట్..!
భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి బ్రేకులు పడ్డట్లు కనిపిస్తోంది. జులై 9 లోపు వాణిజ్య ఒప్పందం పూర్తి చేసుకోవాలని ఇరు దేశాలు భావించినా అమెరికా కొత్త మెలికతో వాజిజ్య ఒప్పందాలకు డెడ్ లాక్ పడినట్లు సమాచారం అందుతోంది. వ్యవసాయం, డెయిరీ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఒప్పందానికి బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది. అగ్రికల్చర్, పాల ఉత్పత్తులపై భారత్ వెనక్కు తగ్గేలేదని తేల్చి చెప్పడంతో ఇరు దేశాలు వాణిజ్య డీల్ కు బ్రేకులు పడ్డట్లు సమాచారం.
అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలకు మంగళవారం డెడ్ లాక్ పడింది. జూన్ 26 నుంచి అమెరికాలోనే ఉన్న భారత వాణిజ్య ప్రతినిధులు అగ్రరాజ్యం పెడుతున్న పలు ఆంక్షలకు ససేమిరా అన్నారు. ముఖ్యంగా భారత్ కు వెన్నెముక అయిన వ్యవసాయం, పాల ఉత్పత్తులు, జన్యుమార్పిడి పంటలు, అలాగే కొన్ని సున్నితమైన రంగాలపై భారత్ వెనక్కు తగ్గడం లేదు. దీంతో జులై 1 న కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి రాలేదు. ఈ మేరకు అమెరికా- భారత్ మధ్య ఇరు దేశాల వాణిజ్య చర్చలు డెడ్ లాక్ అయినట్లు భారత ప్రతినిధులు తెలిపారు.
ముఖ్యంగా డెయిరీ రంగంపై భారత్ లో దాదాపు 8 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వీళ్లంతా చిన్న, సన్నకారు రైతులు కావడంతో వ్యవసాయ సంబంధిత టారిఫ్ ల తగ్గింపు విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తాజాగా వాణిజ్య చర్చలకు డెడ్ లాక్ పడింది. మరోవైపు ఈ ఒప్పందాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. కానీ కొన్ని సున్నితమైన రంగాల్లో ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఈ డీల్ విజయవంతం అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక భారత్ తో చేసుకున్న తొలి ఒప్పందం ఇదే కానుంది.
భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై జూన్ 26 నుంచే వాషింగ్టన్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో భారత వాణిజ్య ప్రతినిధులు అమెరికాలోనే ఉండి చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చల్లో ట్రంప్ గతంలో భారత్ పై విధించిన 26 శాతం అదనపు టారిఫ్ ను కూడా పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ పట్టుబడుతోంది. ప్రస్తుతం భారత్ పై అమెరికా 10 శాతం టారిఫ్ లు విధిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) నినాదంతో పలు దేశాలపై టారిఫ్ లను విధించారు. అయితే అంతర్జాతీయంగా ఒత్తిడి కారణంగా ఆ టారిఫ్ లను 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ గడువు జులై 9తో ముగియనుంది. దీంతో జులై 10 నుంచి భారత్ తో పాటు ఆయా దేశాలపై టారిఫ్ లు విధించనుంది ట్రంప్ సర్కార్.












Click it and Unblock the Notifications