Ukraine - Russia war : ఉక్రెయిన్‌కు భారత్ సాయం.. భారీగా వైద్య సామాగ్రి తరలింపు
రష్యా బాంబుల దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సైనిక స్థావరాలపైనే కాకుండా జననివాసాలపై కూడా విరుచుకుపడుతోంది. ఆస్పత్రులపై కూడా బాంబులు విసిరింది. గత వారం రోజులుగా జరుపుతున్న దాడుల్లో వందలాది మంది సైనికులు, పౌరులు మృతి చెందారు. యుద్ధ పోరులో ఇరుదేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటూ పోరాడుతున్నారు.
ఉక్రెయిన్‌కు అండగా భారత్
రష్యా చర్యలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఉక్రెయిన్కు భారత్ అండగా నిలిచింది. మానవత్వాన్ని చాటుకుంది. ప్రపంచంలో ఏ దేశానికి ఆపద వచ్చినా సాయం అందించడంతో తాము ఉన్నామంటూ నిరూపించింది. ఉక్రెయిన్‌కు అత్యవసరమైన వైద్య సామాగ్రితో పాటు బ్లాంకెట్లు, టెంట్లు, సోలార్ లైట్లలను పంపించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని హండన్ ఎయిర్ బేస్ నుంచి సహాయక సామాగ్రితో కూడిన ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానం బయలు దేరి వెళ్లింది.

ప్రత్యేక విమానంలో వైద్యసామాగ్రి తరలింపు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకు భారత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో సాయం అందిస్తోంది. పోలాండ్ మీదుగా రెండు టన్నుల విలువైన మెడిసిన్స్‌ను ఉక్రెయిన్‌కు భారత ప్రభుత్వం తరలించింది. ఈ విమానం బుకారెస్ట్‌కు చేరుకోనుంది. మరికొంత సాయాన్ని రొమేనియా ద్వారా అందించనుంది. ప్రధాని మోదీ అధ్యక్షత న జరిగిన ఉన్నతస్థాయి అత్యవసర సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవసరానికి వినియోగమయ్యే సామాగ్రిని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఖార్కివ్ నగరాన్ని తక్షణమే వీడండి
మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సీ 17 విమానం ద్వారా భారతీయులను తలించేందుకు చర్యలు చేపట్టింది. అటు ఖార్కివ్ నగరాన్ని తక్షణమే వీడాలని అక్కడి భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. పెసోచిన్, బాబే , బెజ్లియుడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోలని సూచించింది.












Click it and Unblock the Notifications