Israel-Iran: ఆ దేశాలకు విమాన సేవలు నిలిచిపోతాయా..!

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతోన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయన్ యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఇజ్రాయిల్ హమాస్ మధ్య కూడా ఉద్రిక్తత నెలకొంది. తాజాగా ఇజ్రాయిల్ పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.దీంతో అనేక ప్రముఖ విమానయాన సంస్థలు ఇరాన్‌కు విమానాలను రద్దు చేశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ గగనతల వినియోగాన్ని తగ్గించాయి.

భారత విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్, భారత్ మధ్య విమానాల రాకపోకలను నిలిపేయాలని భావిస్తున్నాయి.భారత్ కు చెందిన ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థల విమానాలు ఇరాన్ గగనతలం పై నుంచి కాకుండా ఇతర దేశాల గుండా విమానాలను నడుపుతోన్నాయి. అయితే లుఫ్తాన్సా టెహ్రాన్‌కు, బయలుదేరే విమానాలపై సస్పెన్షన్‌ను పొడిగించింది.

Indian airlines are preparing to stop flights to Israel and Iran

పరిస్థితులు ఉద్రిక్తంగా మరాతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలాను నిలిపేయవచ్చని సంబంధింత వర్గాలు పేర్కొన్నాయి. శనివారం టెల్ అవీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. తిరిగి టెల్ అవీవ్ నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం చేయనున్నాయి. రెండు ప్రధాన విమానయాన సంస్థలు ఎల్అల్, ఎయిర్ఇండియా ఇజ్రాయెల్, భారత్ మధ్య కమర్షియల్ విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే.

దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ఇండియా, విస్తారా ఇరాన్ గగనతలం నుంచి విమానాలను నడపడం ఆపేస్తున్నట్లు ప్రకటించాయి. భారతీయ విమానయాన సంస్థలు యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు విమాన రూట్లలో మార్పు చేశాయి. భారత పౌరులు ఇజ్రాయిల్, ఇరాన్ కు వెళ్లొద్దని భారత ప్రభుత్వం హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+