వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు: భారతీయుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

 Indian arrested in US for allegedly sexually assaulting fellow passenger
వాషింగ్టన్: దేశీయ విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రవాస భారతీయుడ్ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నెవార్క్‌లో నిందితుడు దేవేందర్ సింగ్ (61)ని ఎఫ్‌బిఐ బృందం అదుపులోకి తీసుకుంది. నిందితుడు దేవేందర్ సింగ్ బటాన్‌రూజ్‌లో నివాసముంటున్నాడు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. హూస్టన్ నుంచి నెవార్క్‌కు బయల్దేరిన యూనైటెడ్ ఏయిర్ లైన్స్ విమానంలో కిటికీ పక్క సీటులో కూర్చున్న బాధితురాలి పక్కన దేవేందర్ సింగ్ కూర్చున్నాడు. విమానంలో గాలిలోకి ఎగరగానే బాధితురాలు నిద్రలోకి జారుకుంది.

ఆ తర్వాత దేవేందర్ సింగ్ ఆమెను ముద్దు పెట్టుకోవడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి తరపు న్యాయవాది వెల్లడించారు. మెలకువలోకి వచ్చిన బాధితురాలు అతన్ని దూరం నెట్టివేసి, విమానంలోని సిబ్బందికి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నెవార్క్‌లో విమానం దిగిన వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

న్యూజెర్సీ కోర్టు ఎదుట నిందితుడు దేవేందర్ సింగ్‌ను పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. బాధితురాలు ఆరోపణలు నిజమని తేలితే నిందితుడు సింగ్‌కి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 250,000 డాలర్ల జరిమానా విధించే అవకాశాలున్నాయి.

English summary
A 61-year-old Indian national has been arrested in the US on charges of sexually assaulting a fellow woman passenger aboard a domestic flight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X