భారత్ జాలర్లను కాల్చేస్తాం: నోరు పారేసుకున్న శ్రీలంక ప్రధాని రణిల్
కొలంబో: లంక సముద్ర జలల్లోకి వచ్చే భారత జాలర్లలను కాల్చిపారేస్తామని, అందుకు చట్టం అంగీకరిస్తుందని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే వివాదస్పద వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్నారు. భారత్ జాలర్లు అయితే చూస్తు ఊరుకోవాల, మా సముద్ర జలాలలోకి వారు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తర లంక ప్రజల జీవనోపాధిని భారత జాలర్లు కోల్లగొడుతున్నారనే అంశంపై తంతి టీవీ అనే తమిళ టీవీ చానల్ కు విక్రమసింఘే ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూలో భారత జాలర్లు ఉత్తర లంక ప్రజల కడుపులు కొడుతున్నారని ఆరోపించారు.
ఎవరైనా మా ఇంట్లోకి దౌర్జన్యంగా చోరబడటానికి ప్రయత్నిస్తే నేనే వారిని కాల్చేస్తానని, అందుకు చట్టం నన్ను అనుమతిస్తుందని అనుచితమైన వాఖ్యలు చేశారు. నా వరకు నాకు కొన్ని నియమాలు, నిభందనలు, అభిప్రాయాలు ఉన్నాయని చోప్పుకోచ్చారు. ఇవి మా సముద్ర జలాలు. ఇక్కడ ఉత్తర లంక ప్రజలు చేపలు పడుతూ జీవిస్తున్నారు. ఇక్కడ చేపలు పట్టడానికి జాప్నా జాలర్లను అనుమతించాలి. వారిని అడ్డు కోవడం వలనే భారత జాలర్లు దౌర్జన్యంగా ఇక్కడికి వస్తున్నారని ఆరోపించారు.
అయితే మాతో భారత జాలర్లు ఒప్పందం చేసుకుందాం అని ప్రతిపాదిస్తున్నారు, అందుకు నాకు, మా ప్రభుత్వానికి అభ్యతరం లేదని చెప్పారు. అయితే మా ఉత్తర లంక జాలర్ల జీవనోపాధిని పణంగా పెట్టలేమని, వారి ప్రయోజనాలను దెబ్బతియ్యడానికి తాము సిద్దంగా లేమని అన్నారు. అసలు అది కుదిరే పనే కాదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తేల్చి చెప్పారు.

గత కొన్ని సంవత్సరాలలో దాదాపు 600 మంది భారత జాలర్లను శ్రీలంక నావికాదళ సిబ్బంది అంతం చేశారని గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి కదా అనే ప్రశ్నకు ఆయన తనదైన శైలిలోనే సమాదానం ఇచ్చారు. ఇటివల కాలంలో మాత్రం అలాంటి సంఘటనలు జరగలేదని తేల్చి చెప్పారు. 2011 మాత్రం అలాంటి సంఘటన జరిగినట్లు తనకు గుర్తు ఉందని అన్నారు.
గతంలో ఎల్ టీటీఇ మిలిటెంట్లకు ఆయుధాలు అందజేసేందుకు భారత్ నుండి కోందరు శ్రీలంకకు వచ్చే వారని మళ్లి భారత్ మీద ఆరోపణలు చేశారు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోది శ్రీలంకలో పర్యటించ వలసి ఉంది. ఈ సందర్బంలో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే స్వయంగా భారత్ జాలర్ల పై ఇంత గంభీరమైన వ్యాఖ్యలు చెయ్యడం గమనార్హం. ప్రధాని మోది లంకలో పర్యటించినా రెండు దేశాలకు పెద్దగా ఫలితం ఉండదని రాజకీయ నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications