వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యకు చిత్రహింసలు:పేరేంట్స్‌ను తెచ్చుకొన్న ఎన్ఆర్ఐ

నిత్యం భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. అయినా అతనిలో తన కసి తీరలేదు. భార్యను హింసించేందుకు సహయంగా ఉంటారని ఇండియా నుండి తల్లిదండ్రులను రప్పించుకొన్నాడు ఓ వ్యక్తి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా:నిత్యం భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. అయినా అతనిలో తన కసి తీరలేదు. భార్యను హింసించేందుకు సహయంగా ఉంటారని ఇండియా నుండి తల్లిదండ్రులను రప్పించుకొన్నాడు ఓ వ్యక్తి.అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.

భార‌త్‌కు చెందిన సిల్కీ గేయింద్ (33) త‌న భర్త‌ దేవబిర్ తో క‌లిసి అమెరికాలో ఉంటోంది. వారికి ఓ ఏడాది పాప కూడా ఉంది. కాగా, కొన్ని రోజులుగా వారిద్దరు గొడ‌వ‌లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న భార్య‌ను ఎలాగైనా హింసించాల‌నుకున్న దేవబిర్ భార‌త్‌లో ఉంటోన్న త‌న త‌ల్లిదండ్రుల‌ను అమెరికాకు పిలిపించుకున్నాడు.

Indian Man In Florida Who Posted Doting Photos Of Wife, Daughter, Arrested For Domestic Violence And Child Abuse

త‌న భార్య‌ను హింసించాల‌ని తల్లిదండ్రులకు సూచించాడు. భార్యతో గొడవపెట్టుకుని, ఆమెపై చెయ్యి చేసుకోబోయాడు. అయితే, ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో అత‌డి తల్లిదండ్రులు సిల్కీకి పై దాడికి దిగారు. ముగ్గురూ క‌లిసి ఆమెను చావ‌బాదారు. ఆమె ఎత్తుకున్న పాప‌కు కూడా గాయాలయ్యాయి.

ఆమెను చంపుతామంటూ కత్తితో బెదిరించి రూమ్‌లో ప‌డేసి బంధించారు. బాధితురాలు ఈ విష‌యాన్ని ఇండియాలోని త‌న త‌ల్లిదండ్రుల‌కు తెలిపింది. దీంతో ఆమె తల్లి ఫ్లోరిడా పోలీసులకు సమాచారం అందించ‌డంతో వారు హౌస్టన్ లో ఆమె ఉంటున్న నివాసానికి వచ్చారు. అయితే, ఆమె ఉంటోన్న ఇంటి త‌లుపుల‌ను అత్త‌మామ‌లు ఎంత‌కీ తెర‌వ‌లేదు. దీంతో పోలీసులు త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి లోప‌లికి వెళ్లి నిందితుల‌ని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం సిల్కీతో పాటు ఆమె కూతురికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

English summary
"Some people dream of angels, we dream of one and hold one in our arms," wrote Devbir Kalsi on Facebook, sharing a photograph of his newborn daughter last December. Less than a year later, the 33-year-old Florida resident was arrested by Hillsborough County police on charges of charges of felony assault, false imprisonment, child abuse and denying access to 911.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X