అమెరికాలో భారతీయ పూజారికి 27 ఏళ్ల జైలు

న్యూయార్క్: ఆలయం ఆదాయం స్వాహా చేసి జల్సాలు చేస్తున్న భారతీయ పూజారికి 27 సంవత్సరాల జైలు శిక్షపడింది. సదరు పూజారిని తీసుకు వెళ్లి కటకటాల వెనక్కి పంపించారు. అమెరికాలోని న్యూయార్క్ లో ఈ సంఘటన జరిగింది.

న్యూయార్క్ లోని గార్జియాలో హిందూ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో భారత సంతతికి చెందిన అన్నామలై అలియాస్ శ్రీ సెల్వం సిద్దార్థ్ (49) పూజారిగా పని చేస్తున్నారు. ఈ హిందూ దేవాలయానికి నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వెళ్లి పూజలు చేస్తుంటారు.

Indian priest gets 27-year jail term for bank fraud in U.S.

భక్తులు ఇచ్చే కానుకల వలన ఆలయం ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. ఆలయం ఆదాయం దేవాలయానికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఆలయం ఆదాయం బ్యాంకులో డిపాజిట్ చెయ్యవలసి ఉంటుంది. ఈ భాద్యతలను ఆలయ పూజారి అన్నామలైకి అప్పగించారు.

ఆలయం ఆదాయం బ్యాంకులో జమ చెయ్యకుండా, దేవాలయానికి ఖర్చు పెట్టకుండా అన్నామలై దుర్వినియోగానికి పాల్పడ్డాడని వెలుగు చూసింది. ఆలయం ఆదాయంతో జేబులో వేసుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించి జల్సాలు చేశాడని బయటపడింది.

విషయం తెలుసుకున్న ఆలయ కమిటి సభ్యులు, కొందరు భక్తలు అన్నామలై మీద 2014 ఆగస్టు నెలలో కేసు పెట్టారు. కేసు దర్యాప్తు చేసిన న్యూయార్క్ పోలీసులు అన్నామలై బ్యాంకులలో నిధులు జమ చెయ్యలేదని, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మోసం చేశాడని గుర్తించారు. న్యూయార్క్ లోని న్యాయస్థానం కేసు విచారణ చేసి అన్నామలైకి 27 సంవత్సరాల జైలు శిక్ష విదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+