విచిత్రం: చీమ కుట్టి మహిళ మృతి, ఎక్కడో తెలుసా?
దుబాయ్: చీమ కుట్టి ఓ మహిళ మృతి చెందిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకొంది.కేరళకు చెందిన సూసీ జెఫ్పీ అనే 36 ఏళ్ళ మహిళను ఓ చీమ కుట్టడం వల్ల ఆమె దుబాయ్‌లో చనిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం నాడు చనిపోయిందని కుటుంబసభ్యులు ప్రకటించారు.

ఆసు,పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. జెప్పీని చీమ కరిచింది. దీంతో ఆమె శరీరం వాపు వచ్చింది. ఊపిరి తీసుకోవడానికి కూడ ఇబ్బందిపడింది. అలర్జీకి గురైంది. ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. అలర్జీ కారణంగా ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు.
బాధఇతురాలు ఆసుపత్రికి చేరుకొనే సమయానికి ఆమె బీపీ పడిపోయిందని వైద్యులు చెప్పారు. అంతేకాదు నాడీ స్పందనలు కూడ బాగా తగ్గిపోయాయని వైద్యులు గుర్తు చేశారు. అయితే ఆమెను కుట్టిన చీమ ఏ రకమైందనే విషయమై తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications