ట్రంప్ టారిఫ్ గూగ్లీ.. భారత్ దెబ్బకు క్లీన్ బోల్డ్! అసలు డీల్ వెనుక ఉన్న సీక్రెట్స్ ఇవే!

India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గత 10 నెలలుగా భారత్‌పై ఒత్తిడి పెంచుతూ.. భారీ సుంకాలు విధిస్తామని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక్కసారిగా వెనక్కి తగ్గి ఒప్పందానికి మొగ్గు చూపడం వెనుక భారీ దౌత్య వ్యూహం దాగి ఉంది.

ట్రంప్ వ్యూహం.. సీజ్ ఫైర్ క్రెడిట్ కోసం ఆరాటం
ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య సీజ్ ఫైర్ చేయించడం ద్వారా శాంతిదూతగా పేరు తెచ్చుకుని.. నోబెల్ బహుమతిని సాధించాలనేది ఆయన వ్యూహం. అయితే భారత్ నుంచి ఆయనకు ఆశించిన స్పందన లభించకపోవడంతో ఆగ్రహించిన ట్రంప్ 50 శాతం టారిఫ్ విధిస్తామని బెదిరించారు. కానీ అటు భారత ప్రభుత్వం గానీ.. ఇటు అమెరికా అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లాయి.

Indo-US Trade Deal How India Hit a Sixer on Donald Trump Tariff Googly Master Plan Revealed

తెరవెనుక నడిచిన అసలు కథ
డొనాల్డ్ ట్రంప్ పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నప్పటికీ.. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ఎప్పుడూ ఆగలేదు. ఈ కీలక వాణిజ్య ఒప్పందం వెనుక అనేక కీలక అంశాలు ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, డిప్యూటీ ఎన్ఎస్ఏ పవన్ కపూర్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నిరంతరం వాషింగ్టన్‌లో పావులు కదిపారు. గత కొన్ని నెలలుగా అమెరికాకు చెందిన పలువురు సెనేటర్లు, ప్రతినిధులు భారత్‌లో పర్యటించారు. మైఖేల్ రోజర్స్ నేతృత్వంలోని బృందం భారత్‌ను 'ప్రధాన రక్షణ భాగస్వామి'గా అభివర్ణించింది. భారత్‌లో నూతన అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్.. వైట్ హౌస్‌తో తనకున్న నేరుగా సంబంధాలను ఉపయోగించి ఈ ఒప్పందాన్ని కొలిక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

క్లీన్ బోల్డ్ అయిన ట్రంప్.. భారత్ పంతమే నెగ్గింది!
చివరికి ఏమైందంటే.. తన సొంత మంత్రులు, అధికారులు చెప్పిన లెక్కల ముందు డొనాల్డ్ ట్రంప్ పాత మాటలు చెల్లకుండా పోయాయి. 25 శాతం ఉన్న సుంకాన్ని ఏకంగా 18 శాతానికి తగ్గిస్తూ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి డీల్ అనౌన్స్ చేశారు. అంటే, గత 10 నెలలుగా ఆయన చేసిన విమర్శలన్నీ తుస్సుమన్నాయన్నమాట. మన దేశం రష్యా నుంచి చమురు కొంటున్నా, అమెరికా చెప్పినట్టు కొన్ని మార్పులు చేసుకుంటూనే.. మన ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ డీల్ సాధించుకోవడం ఒక భారీ విజయం.

మనకి వచ్చే లాభాలేంటి?
ఈ ఒప్పందం వల్ల మన దేశంలోని టెక్స్‌టైల్స్ (బట్టలు), ఫార్మా (మందులు), ఐటీ రంగానికి మామూలు బూస్ట్ రాదు. అమెరికా మార్కెట్ మనకు ఫుల్ ఓపెన్ అవుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోల్పోకుండానే అమెరికాతో ఈ లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, అంతర్జాతీయ రాజకీయం దృష్ట్యా కూడా భారత్‌కు దక్కిన అతిపెద్ద దౌత్య విజయంగా చెప్పవచ్చు.మొత్తానికి ట్రంప్ విసిరిన గూగ్లీని భారత్ తనదైన స్టైల్లో సిక్సర్ కొట్టిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+