ఎయిర్ ఆసియా: పింగ్స్ లభ్యం, బ్లాక్ బాక్స్ ఆచూకీ లేదు
జకార్తా, ఇండోనేషియా: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం శకలాలను వెతుకుతున్న బృందాలకు తాజాగా పింగ్స్ దొరికాయి. ఇంతకు ముందు తోక భాగం లభించిన విషయం తెలిసిందే. విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందానికి పింగ్స్ లభించడంతో మిగతా శకలాలు కూడా లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
నిజానికి, ఎయిర్ బస్ ఎ320 - 200 బ్లాక్ బాక్స్ కాక్ పిట్ వాయిస్, ఫ్లయిట్ డేడా విమానం తోకభాగంలోనే ఉంటాయి. అయితే, అవి విడిపోయి ఉంటాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తోక భాగంలో బ్లాక్ బాక్స్ లేదని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ దర్యాప్తు అధికారి సంతోస్ సయోగో చెప్పారు. పింగ్స్ దొరికినట్లు మాత్రం తమకు సమాచారం అందినట్లు చెప్పారు. అది బ్లాక్ బాక్స్ కావచ్చునని భావించామని, గజ ఈతగాళ్లు ధ్రువీకరించాల్సి ఉందని, తోక భాగం నుంచి బ్లాక్ బాక్స్ విడిపోయినట్లుందని, దురదృష్టకరమని అన్నారు.

కాగా, ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ టీవీ చానల్స్ ముందుకు వచ్చి స్పందించారు. విమానం కూలిన విషయంలో తన తండ్రిని తప్పుపట్టవద్దని ఆమె కోరారు.
చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులోని ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పారు. అసలు ఏ పైలట్ కూడా ప్రయాణీకులకు హానీ కలిగించాలని అనుకోరని చెప్పారు. అలా ఓ పైలట్ వ్యవహరిస్తారంటే తాను అంగీకరించలేనని చెప్పారు. తన తండ్రి కూడా ఈ ప్రమాదంలో మరణించారని, ఆయన మృతదేహం కూడా ఇప్పటి వరకు లభించలేదన్నారు. ఇప్పటికే తమ కుటుంబం ఆవేదనలో ఉందన్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications