పిరుదులపై ప్రేమ ప్రాణం తీసింది -లైవ్‌లో చూసి షాక్ -సర్జరీ వికటించి ప్రముఖ మోడల్ మృతి
రోజుకో రకంగా అప్ డేట్ అవుతుండే మోడలింగ్ ప్రపంచంలో తనదైన స్థానం కోసం.. స్టార్ స్టేటస్ కోసం పాకులాడిన ఆమె.. పట్టుమని ముప్ఫై ఏళ్లు నిండకుండానే ప్రాణాలు కోల్పోయింది. కొత్తగా కనపడాలనే ఆత్రంతో పిరుదులకు సర్జరీ చేయించుకుని, అదికాస్తా వికటించడంతో తనువుచాలించింది. కొద్ది గంటలుగా మోడలింగ్, ఫ్యాషన్ రంగాలతోపాటు సోషల్ మీడియలోనూ ఆమె మృత్యువార్త హాట్ టాపిక్ గా మారింది.

ఆమె పేరు వింటేనే జిల్
జోస్లెన్ కానో.. ఈ పేరు వింటే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారు. తన హోయలతో లక్షల మందిని సోషల్ మీడియాలో తన వెంటపడేలా చేసుకుంది. మాగజీన్ కవర్గర్ల్గా, స్విమ్‌వేర్ డిజైనర్‌గా, ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్సర్గా.. అన్నింటికి మించి ‘మెక్సికన్ కిమ్ కర్దాషియన్'గా ప్రపంచం ఆమెకి గుర్తింపు ఇచ్చింది. అయితే బాడీ షేప్‌లకు మెరుగులు దిద్దాలనే ఆమె ప్రయత్నం బెడిసి కొట్టింది. పిరుదులకు సర్జరీ చేయించుకునే క్రమంలో 29 ఏళ్ల జోస్లెన్ . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జోస్లెన్ మరణం.. మోడలింగ్ రంగంలో విషాదం నింపింది.

లైవ్‌లో ఫ్యాన్స్‌కు షాక్
కాలిఫోర్నియాలోని అకెస్ ఫ్యామిలీ ఫునెరల్ హోమ్స్ నుంచి గురువారం జోస్లెన్ కానో అంత్యక్రియల్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. కొలంబియాలో ‘బ్రెజిల్ బట్ లిఫ్ట్ సర్జరీ' చేయించుకుంటుండగా డిసెంబర్ 7వ తేదీనే జోస్లెన్ చనిపోయిందని మోడల్ రీలా మెర్సర్ ట్విట్టర్లో అనౌన్స్ చేసింది. కానో ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అభిమానులు, తోటి మోడల్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆమె సహచర ఇన్ఫ్లుయెన్సర్ డానియెల్లా చేవెజ్ మీడియా ముందుకొచ్చి కన్నీరుమున్నీరుగా విలపించింది.‘కానో.. స్వర్గంలో నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని డానియెల్లా కోరుకుంది.

ఇద్దరు పిల్లల తల్లి
కాలిఫోర్నియాలోని అనహెయిమ్లో 1990 మార్చి 14న పుట్టింది జోస్లెన్. ఐదేళ్ల వయసు నుంచే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన జోస్లెన్.. 17 ఏళ్లకే మాగజీన్ కవర్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. మెక్సికోకి చెందిన దాదాపు అన్ని ప్రముఖ మాగజీన్ కవర్లపై ఆమె మెరిసింది. బికినీ మోడల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 13 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమెకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Recommended Video

ఆ పిరుదులకే క్రేజ్..
ఇదివరకే ఒకసారి బ్రెజిల్ బట్ సర్జరీ చేయించుకుంది జోస్లెన్. అప్పటి నుంచి మీడియా, అభిమానులు ఈ స్విమ్‌వేర్ డిజైనర్‌ని ముద్దుగా ‘మెక్సికన్ కిమ్ కర్దాషియన్'గా పిల్చుకునేవాళ్లు. అయితే రెండోసారి పిరుదులకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాలనే ఆమె ప్రయత్నం ఫలించలేదు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే ఆమె ప్రాణం కోల్పోయింది. ఉన్న ఫాలోయింగ్ సరిపోదన్నట్లు ఇలాంటి ప్రయత్నం ఆమె చేయాల్సింది కాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదకరమైన సర్జరీలకు మోడల్స్ దూరంగా ఉండడం మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications