వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు వ్యాక్సిన్‌ విడుదల చేయడంలో అడ్డంకులు..వివరించిన నిపుణులు

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేంందుకు పోటీపడుతున్నాయి. అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారు చేసి ఎప్పుడెప్పుడు ప్రపంచానికి పరిచయం చేద్దామా అన్నంతగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ తయారు చేసి విడుదల చేయడంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ సారా జాంగ్ అనే అంతర్జాతీయ మ్యాగజీన్ కరస్పాండెంట్ వివరించారు. వ్యాక్సిన్ విడుదల చేయడం ప్రపంచదేశాలకు పెద్ద తలనొప్పిగా మారుతోందని ఆమె అన్నారు.

కరోనా విజృంభిస్తున్న వేళ ముందుగా కొన్ని వందల మిలియన్ మంది అమెరికన్లకు రెండు డోసులు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని సారా చెప్పారు. అయితే ఏ వ్యాక్సిన్‌ అయితే తొలి డోస్‌గా ఇస్తామో అదే వ్యాక్సిన్‌ డోస్ రెండో సారి కూడా ఇవ్వాలని మరో వ్యాక్సిన్‌కు ఇవ్వరాదని హెచ్చరించారు. ఇందుకోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక తీసుకొస్తున్న వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడమనేది మరో సవాలుతో కూడుకున్న పని అని చెప్పారు సారా. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌కు mRNA టెక్నాలజీ వినియోగిస్తున్నారని ఇంతకుముందు వ్యాక్సిన్‌లకు ఇలాంటి టెక్నాలజీ వాడలేదని సారా గుర్తుచేశారు. సాధారణంగా ఈ వ్యాక్సిన్‌లను 94 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఉంచాలని ఈ వాతావరణం డాక్టర్ కార్యాలయంలో ఉండదని చెప్పారు.

Internationl health experts explain as why it is difficult to roll out vaccine for Covid-19

ఇక వ్యాక్సిన్‌లో భాగంగా ఇచ్చే తొలి డోస్ అంత ప్రాముఖ్యత లేదని చెప్పిన సారా.. ఇందుకు కారణం వివరించారు. 94 డిగ్రీల ఫారెన్‌ హీట్ వద్ద వ్యాక్సిన్‌ను స్టోర్ చేయగలిగే వాతావరణం ఇటు అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండదని ఆమె అన్నారు.ఈ వ్యాక్సిన్‌ ఎంత సులభంగా వాడొచ్చనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం అని చెప్పారు. ఇక వస్తున్నది చలికాలం కాబట్టి వ్యాక్సిన్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సారా వివరించారు. ఇక వ్యాక్సిన్ కోసం చాలా ఓపికతో వేచిచూడాలని చెప్పిన సారా... చాలా వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని గుర్తుచేశారు. కొన్ని ట్రయల్స్ విఫలం అవుతుంటాయని అంత మాత్రాన నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. ట్రయల్స్ అంటేనే సక్సెస్ రేటు ఫెయిల్యూర్ రేటు ఉంటుందని చెప్పారు.

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్లినికల్ ట్రయల్స్ పెద్ద సంఖ్యలో జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా ఏదో ఒకటి సక్సెస్ అవుతుందని అదే కరోనాకు విరుగుడుగా అవతరిస్తుందనే ఆశాభావం సారా వ్యక్తం చేశారు. అయితే ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు ఓపికతో ఎదురుచూడటం, తగు జాగ్రత్తలు పాటించడం తప్ప చేసేదేమీ లేదని సారా చెప్పారు.

English summary
Rolling out a vaccine includes heavy work says Sarah zhang who is a health expert and warns that the first dose used of a certain vaccine should be used for the second dose also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X