అయ్యో.. 5 లక్షల ఐఫోన్ లు సముద్రంపాలు.. రూ. 4 వేల కోట్లు నష్టం..!
ఎన్ని మొబైల్ ఫోన్ లు వచ్చినా ఐఫోన్ కు ఉండే క్రేజే వేరు. ఐఫోన్ 17 సిరీస్ 2025 సెప్టెంబర్ లో విడుదలైంది. దీని ధర భారత్ లో రూ. 50 వేల నుంచి ప్రారంభం ఉన్నట్లు సమాచారం. అయితే దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నౌక ప్రమాదంలో దాదాపు 50 కంటైనర్లు సముద్రంలో మునిగిపోయాయి. వాటిలోని దాదాపు 5 లక్షల ఐఫోన్ 17లు నీట మునిగినట్లు సమాచారం అందుతోంది. వీటి విలువ దాదాపు రూ. 4 వేల కోట్లు అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దక్షిణ అమెరికాలోని పెరూలో ప్రముఖ నౌకాయాన సంస్థ ఎవర్ గ్రీన్ కు చెందిన కార్గో నౌక సముద్రంలో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. చైనాలోని షెన్ జెన్ నుంచి లాస్ ఏంజల్స్ కు వెళ్తున్న ఎవర్ గ్రీన్ కార్గో నౌక పెరూ తీరంలో బలమైన గాలులు, అలల కారణంగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు 50 కంటైనర్లు పసిఫిక్ సముద్రంలో పడిపోయాయినట్లు తెలుస్తోంది.

వీటిల్లో ఉన్న 5 లక్షల ఐఫోన్ 17 లు నీటిలో మునిగిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ నష్టం విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ కథనంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇది నిజమేనా అని గ్రోక్ ఏఐ టూల్ ను అడుగుతున్నారు. నేచర్ ఈజ్ కాలింగ్, ఇది వాటర్ ప్రూఫ్ ఫోన్.. నేను, మా ఫ్రెండ్ వెళ్తున్నాం.. అని కామెంట్స్ చేస్తున్నారు. అడ్రస్ పెట్టు అని మరొకరు కామెంట్ చేశారు. ఐ ఫోన్ నుంచి ఐ గాన్ అయిందన్నారు. లొకేషన్ ప్లీజ్ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. నేను ఈత నేర్చుకోనందుకు బాధపడుతున్నానని మరొకరు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications