అమెరికాకు బిగ్ షాక్.. ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్.. సైనిక స్థావరాలపై భారీ దాడి..!

ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో తలదూర్చిన అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. సిరియాలో అమెరికాకు చెందిన మూడు సైనిక స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. దీనిపై అమెరికా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడిలో ఎంతమంది మృతి చెందారన్న దానిపై స్పష్టత లేదు. మరికాసేపట్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 9 రోజులుగా యుద్ధం భీకర స్థాయిలో జరుగుతోంది. అమెరికా ఎంట్రీతో అక్కడి పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఇటీవల జూన్ 21 న ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి.

Iran Allegedly Attacks US Bases in Syria Three Reportedly Destroyed

ఇరాన్ లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులు నిర్వహించింది. బీ2 బాంబర్లతో ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ దాడులకు తాజాగా ప్రతీకారం తీర్చుకుంది ఇరాన్. సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. మూడు సైనిక స్థావరాలు ధ్వంసం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై అటు ఇరాన్ గానీ ఇటు అమెరికా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే అమెరికా తీరుపై అంతకుముందు ఇరాన్ మండిపడింది. ఈ మేరకు అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్ని అటు ప్రపంచ దేశాలు సైతం ఖండించాయి. ఈ క్రమంలోనే సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం గమనార్హం.

మరోవైపు ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ ఆర్థిక రంగాన్నే స్తంభింపజేసేలా ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది. ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేసేందుకు సిద్దం అవుతోంది. ఏ క్షణమైనా ఇరాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ క్రమంలోనే హార్మోజ్ జల సంధిని మూసివేస్తాం అని ఇరాన్ ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+