అమెరికాను వణికిస్తున్న ఇరాన్ 'డర్టీ బాంబ్' ముప్పు!.. . ట్రంప్ అధికారులే టార్గెట్!!

Iran US Conflict: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ ప్రపంచాన్ని వణికించే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులను టార్గెట్‌గా చేసుకుని 'డర్టీ బాంబ్' లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు పసిగట్టాయి. ఏడుగురు అమెరికా ఉన్నతాధికారులే లక్ష్యంగా ఈ దాడికి ప్లాన్ చేసినట్లు సీఎన్ఎన్ ఈ కథనాన్ని ప్రచురించింది.

ఇజ్రాయెల్‌కు ఎందుకీ షాక్?: హఠాత్తుగా చేతులెత్తేసిన ట్రంప్ సర్కార్!
ఇజ్రాయెల్‌కు ఎందుకీ షాక్?: హఠాత్తుగా చేతులెత్తేసిన ట్రంప్ సర్కార్!

నిఘా వర్గాల అలర్ట్.. ఇరాన్ ఖండన
ఇరాన్ రహస్య సంభాషణల్లో బాంబు తయారీ సామగ్రిని ఇప్పటికే అమెరికా గడ్డపై నిల్వ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. అయితే ఇరాన్‌కు అంతటి సామర్థ్యం ఉందా లేదా అనే దానిపై అమెరికా అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రాచ్యంలోని అమెరికా బలగాలపై రసాయన ఆయుధాలను ప్రయోగించే ప్రమాదంపై కూడా అమెరికా అప్రమత్తమైంది. మరోవైపు వైట్‌హౌస్ ప్రతినిధి లారెన్ బిస్ స్పందిస్తూ.. ప్రస్తుతం దేశానికి తక్షణ ముప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇరాన్ విదేశాంగ శాఖ, ఐరాసలోని ఇరాన్ మిషన్ ఈ ఆరోపణలను నిరాధారమైనవి, కల్పితాలు అంటూ తీవ్రంగా ఖండించాయి.

Iran Dirty Bomb Plot Against Donald Trump Officials US Intelligence Alert and What It Means Details

అసలేంటీ డర్టీ బాంబ్? ఎలా పనిచేస్తుంది?
సాంకేతిక భాషలో దీనిని రేడియోలాజికల్ డిస్పర్షన్ డివైస్ అని పిలుస్తారు. ఇది అణుబాంబు కాదు, కానీ సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక పదార్థాలను జోడించి తయారు చేసే ప్రమాదకర ఆయుధం. అణుబాంబు మాదిరిగా ఇది నగరాలను పూర్తిగా నాశనం చేసే అణు విచ్ఛిత్తి పేలుడును సృష్టించదు. కానీ ఇందులోని సాధారణ బాంబు పేలినప్పుడు ఆ పేలుడు ధాటికి రేడియోధార్మిక ధూళి, పొగ చుట్టుపక్కల గాలిలో వేగంగా వ్యాపిస్తుంది. వైద్య, పారిశ్రామిక రంగాల్లో వాడే రేడియోధార్మిక పదార్థాలతో దీనిని సులభంగానే తయారు చేసే అవకాశం ఉండటం ఆందోళన కలిగించే అంశం. గతంలో 2022 రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ ఈ డర్టీ బాంబ్ ప్రస్తావన తీవ్ర చర్చనీయాంశమైంది.

మోదీకి ట్రంప్ బిగ్ కాంప్లిమెంట్.. ఆ ఒక్క మాటతో ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు!
మోదీకి ట్రంప్ బిగ్ కాంప్లిమెంట్.. ఆ ఒక్క మాటతో ఆకాశానికెత్తిన అమెరికా అధ్యక్షుడు!

దీనివల్ల నష్టం ఎలా ఉంటుంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డర్టీ బాంబ్ వల్ల కలిగే తక్షణ ప్రాణనష్టం రేడియేషన్ కంటే సాధారణ బాంబు పేలుడు వల్లే ఎక్కువగా ఉంటుంది. కానీ దాని తర్వాతి పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. పేలుడు ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారు రేడియోధార్మిక ధూళిని పీల్చడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. రేడియేషన్ కంటికి కనిపించదు, వాసన రాదు. దీనిని ప్రత్యేక పరికరాలతోనే గుర్తించాలి. ఒకసారి ఒక ప్రాంతంలో రేడియేషన్ వ్యాపిస్తే, ఆ భవనాలు, వ్యాపార సముదాయాలు నెలల తరబడి నివాసయోగ్యం కాకుండా పోతాయి. ప్రజలను ఖాళీ చేయించడం, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. ప్రాణనష్టం కంటే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించి, జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేయడానికే ఇలాంటి సామూహిక విధ్వంసక ఆయుధాలను ఉగ్రవాదులు లేదా శత్రుదేశాలు ఎంచుకుంటాయని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+