భీకర యుద్ధ భయంతో యూఏఈ, గల్ఫ్ దేశాల్లో కోటికిపైగా ప్రవాస భారతీయులు!
ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచ దేశాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. యుద్ధం కారణంగా మానవజీవనం ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా చమురుధరలు బాగా పెరుగుతాయన్న ఆందోళన కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్య ప్రాచ్య దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో ఆందోళన పెరుగుతోంది.
యూఏఈతో పాటు 8గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని ఎనిమిది దేశాల్లో ప్రవాస భారతీయులు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని ఎనిమిది దేశాల్లో సుమారు కోటి మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా. ఉపాధి, వ్యాపారం, నిర్మాణ రంగాలు, సేవా రంగాల్లో పనిచేస్తున్న ఈ భారతీయులు ప్రస్తుత పరిణామాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

ఈ ప్రాంతాలలో పరిస్థితిపై ఆందోళన
ప్రత్యేకంగా ఖతార్, దుబాయ్, కువైట్, అబుదబి వంటి ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు కఠినతరం చేయడంతో పాటు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. కొన్ని చోట్ల జరుగుతున్న దాడులతో విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేయటంతో పాటు, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
ఎప్పుడేం జరుగుతుందో.. బిక్కుబిక్కుమంటున్న ప్రవాస భారతీయులు
ఉద్యోగాల కోసం వెళ్లిన కార్మికులు, కుటుంబ సభ్యులను చూసేందుకు వెళ్లినవారు, విద్యార్థులు ఇలా అనేక వర్గాలకు చెందిన భారతీయులు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి అంటూ పలువురు తమ భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో ఉన్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

ప్రవాస భారతీయులకు భారత రాయబార కార్యాలయాల సహాయం
ఇక ప్రవాస భారతీయులకు భారత రాయబార కార్యాలయాలు తామున్నామని భరోసా ఇస్తున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసి, ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే సంప్రదించాలని కూడా సూచించాయి. అలాగే, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని పేర్కొంటున్నాయి. వదంతులను నమ్మి భయపడవద్దని సూచిస్తున్నాయి.













Click it and Unblock the Notifications