ఆ ఇద్దరి రాకతో జాగ్రత్త పడ్డ ఇరాన్- అనుకున్నదంతా అయింది
ఇస్లామాబాద్‌లో జరిగిన దౌత్యపరమైన చర్చలు ఇప్పుడు అమెరికా- ఇరాన్ మధ్య మాటల యుద్ధంగా రూపాంతరం చెందాయి. 21 గంటల సుదీర్ఘ మారథాన్ సమావేశం ముగిసిన తర్వాత అమెరికా ప్రతినిధిగా హాజరైప ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో- ఇరాన్.. అమెరికాపై సంచలన ఆరోపణలు చేసింది. శాంతి చర్చలలో నిబద్ధతను ప్రశ్నించింది. ఇక ముందు చర్చలు జరిపే ప్రసక్తే ఉండబోదనీ తేల్చి చెప్పింది.
అమెరికా శాంతిని కోరుకోవట్లేదని చర్చలు కొలిక్కి రాకపోవడానికి, అర్ధాంతరంగా ముగియడానికీ ఒక సాకును మాత్రమే అన్వేషిస్తోందని ఇరాన్ విమర్శించింది. తదుపరి విడత చర్చలు జరిపే అవకాశం ఎంత మాత్రం లేదని కూడా ఇరాన్ స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చర్చలకు విఘాతం కలిగించాయని వ్యాఖ్యానించింది.

చర్చలు విఫలం కావడం, జేడీ వాన్స్ అమెరికాకు తిరుగుముఖం పట్టిన అనంతరం ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఫార్స్.. ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అమెరికా ఈ చర్చలను నిజానికి తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని, కాలక్షేపంగా భావించిందని ఆరోపించింది. ఇస్లామాబాద్ నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదని, అక్కడి నుంచి 'పలాయనం చిత్తగించడానికి' ఓ సాకును మాత్రమే వెతుకుతోందని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
చర్చలు విఫలమైతే ఆ పరువు నష్టం ఇరాన్‌పై మోపడానికి వీలుగా, అమెరికా కావాలనే ఆమోదయోగ్యం కాని షరతులు విధించిందని ఇరాన్ ఆరోపించింది. టెహ్రాన్ నుండి వచ్చిన ఈ ప్రకటన రెండు దేశాల మధ్య నెలకొన్న అగాథాన్ని స్పష్టం చేసినట్టయింది. 21 గంటల పాటు జరిపిన సుదీర్ఘ చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, జేడీ వాన్స్ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లారని తేల్చింది. ఈ బృహత్ చర్చల తర్వాత ప్రపంచం ముందు తమ విజయాన్ని చాటి చెప్పాలని అమెరికా ఆశించింది గానీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు.
ఈ మొత్తం చర్చలలో అతి ముఖ్యమైన అంశం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి. ప్రస్తుతం ఇది మూతపడింది. ఈ మార్గాన్ని తిరిగి తెరవడానికి అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది గానీ ఇరాన్ మాత్రం వెనుకంజ వేయలేదు. దీనిపై కఠినంగా వ్యవహరించింది. తమ అనుమతి లేకుండా ఈ సముద్ర మార్గం తెరవడానికి వీల్లేదని గట్టిగా చెప్పింది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్‌కాఫ్, జేర్డ్ కుష్నర్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు రావడం మొదటి నుంచీ ఇరాన్ కు ఇష్టం లేదని తెలుస్తోంది. స్టీవ్ విట్‌కాఫ్, కుష్నర్‌ల పట్ల ఇరాన్ జాగ్రత్తగా ఉంటూ వచ్చింది. గతంలో ఒమాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలలో వీళ్లిద్దరూ పాలుపంచుకున్నారు. అవి విఫలమైన తర్వాతే ఇరాన్ పై దాడులు ఆరంభం అయ్యాయి.
-
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి.. -
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications