ఇరాన్ ప్రతీకారం: మంటల్లో అమెజాన్ డేటా సెంటర్.. 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి!

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ జరిపిన మిస్సైల్, డ్రోన్ దాడుల్లో యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ దెబ్బతింది. దీంతో అమెజాన్ తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కువైట్, యూఏఈ (UAE) లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

అసలేం జరిగిందంటే?
అమెజాన్ క్లౌడ్ విభాగం AWS తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 1, 2026 ఆదివారం తెల్లవారుజామున యూఏఈలోని డేటా సెంటర్‌లోకి ఏదో ఒక వస్తువు (మిస్సైల్ లేదా డ్రోన్ శకలాలు) వచ్చి బలంగా ఢీకొట్టింది. దీనివల్ల డేటా సెంటర్‌లో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి.. భారీగా మంటలు వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా ఆ సెంటర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కార్యకలాపాలను పూర్తిగా మూసివేసినట్లు అమెజాన్ ధ్రువీకరించింది.

Iran Revenge Amazon Data Center on Fire in UAE 97 Missiles and 283 Drones Attack Kuwait

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు
ఇరాన్ తన దాడుల పరిధిని పెంచింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమైన ఈ ప్రతిదాడుల్లో యూఏఈలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్, దుబాయ్‌లోని జబేయ్ అలీ పోర్ట్ వంటి కీలక ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలోనే విమానాశ్రయాలు, రేవులు, నివాస ప్రాంతాలపై జరిగిన దాడుల ప్రభావంతో అమెజాన్ డేటా సెంటర్ కూడా మంటల్లో చిక్కుకుంది. దుబాయ్, అబుదాబి నగరాల్లో పేలుళ్ల శబ్దాలు విన్నామని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

డేటా సెంటర్ మూసివేస్తే ఏమవుతుంది?
డేటా సెంటర్లు అనేవి ఇంటర్నెట్ ప్రపంచానికి వెన్నెముక వంటివి. ఇక్కడ లక్షలాది కంప్యూటర్ సర్వర్లు నిరంతరం పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్లు, యాప్‌లు, ఆన్‌లైన్ సేవలను నడిపిస్తాయి. ఈ ఘటన వల్ల AWS కి చెందిన EC2 నెట్‌వర్కింగ్, డేటాబేస్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ సెంటర్ మూతపడటంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఫుడ్ డెలివరీ యాప్స్, క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లు నెమ్మదించాయి. వినియోగదారులు ఇతర ప్రాంతాలలో ఉన్న సర్వర్లను వాడుకోవాలని అమెజాన్ సూచించింది.

ఉద్రిక్త పరిస్థితులు
అమెరికా ఇరాన్‌పై జరిపిన దాడుల వీడియోలను విడుదల చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మరోవైపు ఇరాన్ దాడులకు Anthropic Claude AI వంటి అధునాతన సాంకేతికతను వాడుతోందనే వార్తలు కూడా టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో టెక్నాలజీ దిగ్గజాలు తమ మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు, అందులో తెలుగు వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ యుద్ధ వాతావరణం, ఇంటర్నెట్ అంతరాయం వారి జీవనశైలిని, కమ్యూనికేషన్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

కువైట్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్
సోమవారం తెల్లవారుజామున ఇరాన్ భారీ ఎత్తున విమాన దాడులకు తెగబడింది. కువైట్ భూభాగంపై ఇరాన్ ఏకకాలంలో 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడికి దిగింది. రధానంగా చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. కువైట్ గగనతలం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. ఈ స్థాయిలో దాడులు జరగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+