యుద్ధంతో "ఖమేనీ" కి మృత్యు భయం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఇరాన్ సుప్రీం లీడర్
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం తారా స్థాయికి చేరింది. గత వారం రోజులుగా ఇరు దేశాలు వెనక్కు తగ్గకుండా ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్ లతో దాడులు చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మృత్యు భయం పట్టుకుంది. ఈ క్రమంలో సంచలన నిర్ణయం దిశగా ఆయన ఆలోచిస్తున్నారు.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఘోర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చావు భయంతో ఉన్నారు. ఈ క్రమంలో తన తరువాతి వారసుడ్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన తరువాత ఇరాన్ కు నాయకత్వం వహించేందుకు ముగ్గురు పేర్లను ఆయన ప్రతిపాదించారు. ఈ ముగ్గురు క్లెరిక్ లకు ఆ సామర్థ్యం ఉందని ఖమేనీ తెలిపారు. మూడు దశాబ్దాలుగా ఇరాన్ ను పరిపాలిస్తూ వస్తున్నానని.. ఇక తన వారసుడిని ప్రకటించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నట్లు సమాచారం.
అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రతిపాదించిన పేర్లలో ఆయన కుమారుడు మోజ్ తాబా పేరు లేకపోవడం గమనార్హం అని న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు వెల్లడించింది. ఆయన కూడా ఓ క్లెరిక్ స్థానంలో ఉన్నా ఖమేనీ.. తన కుమారుడి పేరుని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా పేర్కొంది ఆ పత్రిక.

అసలైతే ఖమేనీ తర్వాత ఇరాన్ లోని మరో సుప్రీం లీడర్ ఇబ్రహీం రైసీనే ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని అందరూ భావించారు. కానీ 2024 లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కొత్తగా ముగ్గురిని ప్రతిపాదించారు ఖమేనీ. ఇక ప్రస్తుతం ఖమేనీ ఓ బంకర్ లో దాక్కున్నట్లు సమాచారం. అన్ని డిజిటల్ మాధ్యమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాను నమ్మే కొందరు వ్యక్తుల ద్వారా ఇరాన్ మిలిటరీకి సమాచారం ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు ఇరాన్ కు చెందిన మరో ముగ్గురు కమాండర్లను హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం తాజా ప్రకటనలో పేర్కొంది. ఇరాన్ పై తమ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో వాళ్లు హతమయ్యారని వెల్లడించింది. అదే విధంగా ఇరాన్ తో అణు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇరాన్ ను ఏం చేయాలో అదే చేస్తామని.. మరో రెండు మూడేళ్లు కోలుకోలేని విధంగా శిక్ష వేస్తామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి గిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications